Bigg Boss 5 Telugu: అసలు బొమ్మల టాస్క్ లో ఏం జరిగింది..?

బిగ్ బాస్ లో బొమ్మల టాస్క్ లో హౌస్ మద్యలో లొల్లి జరుగుతూనే ఉంది. ఇక్కడే సంచాలక్ అయిన సిరికి ఇంకా ప్రియకి గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది. అంతకముందు సిరి అనీమాస్టర్ తో చిన్నపాటి యుద్ధమే చేసింది. నేను గేమ్ జెన్యూన్ గా ఆడుతున్నా కూడా నన్ను మాటలు అంటున్నారు అంటూ ఫీల్ అయ్యింది. అయితే, అన్నీ టీమ్స్ బెల్ట్ దగ్గర బొమ్మలు లాగేటపుడు సంచాలక్ లు ఇద్దరూ కూడా రూల్స్ పెట్టారు. గీత దాటేకే మెటీరియల్ తీస్కోవాలి అంటూ చేతులు అడ్డం పెట్టి మరీ అక్కడే ఉన్నారు. అయినా కూడా హౌస్ మేట్స్ అది పాటించకుండా వచ్చిన మెటీరియల్ ని బెల్ట్ లోపల నుంచే లాగేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఇక్కడే సన్నీ గొడవ చేశాడు. ఎక్కువ కాటన్ తీస్కున్నారని సిరి అబ్జక్ట్ చేసింది. వాళ్లిద్దరికీ గొడవ అయిన క్రమంలో ఈసారి ఎల్లో టీమ్ కి, గ్రీన్ టీమ్ కి ముందువరుసలో అవకాశం కల్పించాలని సంచాలక్ గా నిర్ణయించాం అంటూ రెడ్ టీమ్ కి చెప్పింది సిరి. ఇక్కడే ప్రియ నేను దీనికి ఒప్పుకోను ఇదేం రూల్ అసలు అంటూ సిరిపై వాదనకి దిగింది. ఫస్ట్ నిదానంగా స్టార్ట్ చేసినా, సంచాలక్ అక్కడ నుంచుని అన్నీ చూస్కోవాలి. అసలు మీరేం పీకుతున్నారు అంటూ తనదైన స్టైల్లో రెచ్చిపోయింది. ఇక్కడే సిరి అలా మాట్లాడద్దు మీరెందుకు మాట్లాడుతున్నారు. సంచాలక్ గా మా ఇష్టం మేం ఏదైనా రూల్ పెడతాం అంటూ సిరి చెప్పింది.

అసలు ముందు కాటన్ లాక్కున్న బ్లూటీమ్ అండ్ రెడ్ టీమ్ అలానే ఆడుతున్నారు అందరూ. ఫస్ట్ రోజు టాస్క్ లో కూడా అలాగే ఆడారు.. మరి అప్పుడు మీకు అది కనిపించలేదా అంటూ ప్రియ ఎదురుదాడికి దిగింది. ఇక్కడే ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. ఇక బిబి బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ లో సంచాలకులు అయిన ఇద్దరూ కూడా గేమ్ స్ట్రాటజీలని వర్కౌట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ బిగ్ బాస్ ఎప్పటికప్పుడు గేమ్ లో ట్విస్ట్ ఇస్తూ ఈసారి ఏకంగా టాస్క్ నుంచీ కొంతమందిని డిస్ క్వాలిఫై చేశాడు. అదీమేటర్.

[yop_poll id=”3″]

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus