Priyadarshi: ‘గేమ్ ఛేంజర్’ కి 25 రోజులు కాల్షీట్స్ ఇచ్చాను.. ఓపెన్ అయిపోయిన ప్రియదర్శి!

రాంచరణ్ (Ram Charan)  – శంకర్ (Shankar) కాంబినేషన్లో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  అనే సినిమా రూపొందింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని ఫలితం ఏంటో అందరికీ తెలుసు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజులకే..’ ‘గేమ్ ఛేంజర్’ ఫైనల్ ఔట్పుట్ తో నేను సంతృప్తిగా లేను.. చాలా ఫుటేజీ డిలీట్ చేయాల్సి వచ్చింది’ అంటూ కామెంట్ చేశాడు.

Priyadarshi

సో ఈ సినిమాలో చాలా పోర్షన్ బయటకి రాలేదు అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అందులో ప్రియదర్శి (Priyadarshi) నటించిన ఫుటేజీ కూడా చాలా ఉంది అని టాక్ నడిచింది. ఈ విషయంపై ‘కోర్ట్’ (Court) ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చాడు. ప్రియదర్శి ఈ విషయంపై స్పందిస్తూ ” ‘గేమ్ ఛేంజర్’ సినిమా నేను ‘బలగం’ (Balagam) కంటే ముందు సైన్ చేసిన సినిమా.

ఆ టైంలో హీరో ఫ్రెండ్ రోల్స్ చేస్తుండేవాడిని. ఆ సినిమాకి చాలా టైం పట్టింది. అది అందరికీ తెలుసు. ఆ సినిమా షూటింగ్ ఎలా మొదలైంది, ఎలా సాగింది అనేది ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో చాలా సీన్స్ చేశాను. అవి ఎడిటింగ్లో పోయాయి. అంతకు మించి వేరే కారణాలు లేవు. నేను 25 రోజులు ఆ సినిమాకి కాల్షీట్స్ ఇచ్చాను.

కానీ 2 మినిట్స్ కూడా ఉండను. అది నేను ముందే ఊహించాను. కానీ శంకర్ వంటి గొప్ప దర్శకుడు, రాంచరణ్ వంటి గొప్ప హీరో సినిమాలో నటించే ఛాన్స్ మళ్ళీ రాదు అనిపించింది. అందుకే నేను ఆ సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించాను” అంటూ చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

4వ సారి తండ్రైన బిగ్ బాస్ కంటెస్టెంట్.. పిక్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus