Darling Trailer: ప్రియదర్శి ‘డార్లింగ్’ ట్రైలర్ టాక్.. ఎలా ఉందంటే?

‘డార్లింగ్’ (Darling) అనే టైటిల్ వినగానే ప్రభాస్ (Prabhas) – కాజల్ (Kajal Aggarwal) కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ గుర్తుకొస్తుంది. ప్రభాస్ ప్లాపులతో సతమతమవుతున్న టైంలో ఓ క్యూట్ లవ్ స్టోరీతో మిక్స్ చేసిన ఫ్యామిలీ డ్రామా చేశాడు. అదే ‘డార్లింగ్’ సినిమా..! ఆ టైంకి అదొక డిఫరెంట్. ప్రభాస్ ని అంతా డార్లింగ్ అని పిలుస్తారు కాబట్టి.. ఆ టైటిల్ ఆ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. టిపికల్ లవ్ స్టోరీ అయినప్పటికీ దర్శకుడు కరుణాకరన్ (A. Karunakaran) ..

కామెడీని, ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా బ్యాలెన్స్ చేశాడు. అయితే 14 ఏళ్ళ తర్వాత ఇదే టైటిల్ తో ప్రియదర్శి (Priyadarshi) హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. నభా నటేష్ (Nabha Natesh) ఇందులో హీరోయిన్. ‘హనుమాన్’ (Hanu Man) వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ అందించిన ‘ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌’ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి భార్య చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ట్రైలర్ ని వదిలారు. ఓ అమాయకుడు అయినటువంటి హీరో స్ప్లిట్ పర్సనాలిటీ కలిగిన హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటే..

అతనికి ఎలాంటి కష్టాలు వచ్చాయి అన్నది ఈ సినిమా మెయిన్ పాయింట్ గా ట్రైలర్ తో రివీల్ చేశారు. కామెడీ కూడా ఈ సినిమాలో గట్టిగానే దట్టించినట్టు స్పష్టమవుతుంది.డార్లింగ్ అంటే అంతా ఓ లవ్ స్టోరీ ఏమో అని అనుకున్నారు. కాదు ఇది అపరిచితుడు ఫిమేల్ వెర్షన్ లా కనిపిస్తుంది. తమిళ దర్శకుడు అశ్విన్ రామ్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు.

 

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus