Darling Movie: ‘డార్లింగ్‌’ సినిమా ఫస్ట్‌ హీరో ప్రియదర్శి కాదా? మరో బక్క హీరోనా?

ఇండస్ట్రీలో ఒక మాట ఉంటుంది. ‘ఇది ఆయన కోసం మాత్రమే రాసుకున్న కథ’ అని. ఈ మాటను నమ్మొచ్చా అంటే అంతగా నమ్మలేము అని చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమా పట్టాలెక్కడానికి ముందు ఆ కథ చాలామంది హీరోలు, హీరోయిన్ల దగ్గరకు వెళ్లే వచ్చి ఉంటుంది. ఒకప్పుడు ఈ విషయాలు తెలియవు కానీ.. ఈ ‘రూమర్ల’ కాలంలో (కొన్నిసార్లు ఆ వ్యక్తులే రూమర్లు చెబుతారు అనుకోండి) తెలిసిపోతున్నాయి. తాజాగా రిలీజ్‌ అయిన ‘డార్లింగ్‌’ (Darling) సినిమా విషయంలోనూ ఇదే జరిగింది అంటున్నారు.

ఈ సినిమాలో హీరోగా దర్శకుడు అశ్విన్‌ రామ్‌ (Aswin Raam) తొలుత ప్రియదర్శిని అనుకోలేదట. ఆ కథను ఆయన తొలుత అల్లరి నరేశ్‌కు (Allari Naresh)  వినిపించారట. అంతా ఓకే అనుకున్నా.. సెకండాఫ్‌ విషయంలో కొన్ని మార్పులు చేయాలి అని అల్లరి నరేశ్‌ కోరారట. ఈ విషయంలో చర్చలు ఎంతకీ తేలకపోవడంతో అశ్విన్‌ రామ్‌ వేరే హీరోను వెతక్కునే పనిలో పడ్డారట. నరేశ్‌ కంటే ముందే కథను విన్న ప్రియదర్శి  (Priyadarshi)  దగ్గరకే మళ్లీ ‘డార్లింగ్’ కథ వచ్చింది.

గతంలో అడ్డొచ్చిన మార్కెట్‌ ముచ్చట ఈ సారి అడ్డురాలేదు. ఎందుకంటే ఆరేళ్ల క్రితం కథ తొలిసారి ఓకే అనుకున్నప్పుడు దర్శికి అంత మార్కెట్‌ లేదు. అయితే ‘బలగం’ (Balagam) సినిమా ఎఫెక్ట్‌తో దర్శి మీద అంత మొత్తంలో బడ్జెట్‌ పెట్టడానికి నిర్మాత ముందుకొచ్చారు. అలా తిరిగి తిరిగి దర్శిక దగ్గరకే వచ్చింది ‘డార్లింగ్‌’. అయితే అలా వచ్చిన సినిమా దర్శికి పెద్దగా లాభించలేదు అంటున్నారు.

సినిమాలో కొన్ని ఎలిమెంట్స్‌ వర్కవుట్‌ కాకపోవడంతో ఫలితం తేడా కొట్టింది అంటున్నారు. అయితే సోమవారం వస్తే కానీ అసలు సంగతి బయటకు రాదు. ఒవేళ అప్పుడు కూడా సినిమా తేడా కొడితే నరేశ్‌ బచాయించినట్లే. ఎందుకంటే నరేశ్‌కు కూడా చాలా రోజులుగా సరైన హిట్‌ సినిమా అవసరం ఉంది. ఇది చేసుకుంటే ఇబ్బందిపడేవాడే. అయినా ఎవరికి రాసిపెట్టి ఉన్న కథ వారి దగ్గరకే తిరిగి తిరిగి వస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus