తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన పెళ్లి చూపులు సినిమాలో హీరోకి ఫ్రెండ్ గా కౌశిక్ క్యారెక్టర్ లో నటించి, తనకు మాత్రమే సాధ్యమైన సరికొత్త టైమింగ్ తో ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొట్టాడు నటుడు ప్రియదర్శి. ఆ మూవీ లో తన కామెడీ టైమింగ్ చాలా ఫ్రెష్ గా ఉండటంతో డైరెక్టర్స్ కూడా వారి మూవీస్ లో దర్శి కోసం స్పెషల్ గా క్యారెక్టర్స్ రాసారు.
Priyadarshi
ఆ తరువాత దర్శి హీరోగా విభిన్నమైన సినిమాలను ఎంచుకోవటం, అవి అన్ని విజయాలు సాధించకపోయినా , కొన్ని హిట్ అయ్యి దర్శి కి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. వాటిలో మల్లేశం, బలగం,కోర్ట్ ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దిల్ రాజ్ నిర్మాణంలో జబర్దస్త్ వేణు దర్శకత్వం వహించిన బలగం మూవీ ఒక సంచలనం. గ్రామీణ నేపథ్యంలో చాలా స్వచ్ఛమైన తెలంగాణ ఎమోషన్స్ తో భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిత్రం.
ఈ మూవీ లో కథానాయకుడిగా దర్శి క్లైమాక్స్ లో నటించిన తీరు తన కెరీర్ లోనే బెస్ట్ అని చెప్పవచ్చు. దాని తరువాత హీరో నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ మూవీ లో అడ్వాకేట్ పాత్రలో జీవించాడు దర్శి. ఇది ఇలా ఉండగా దర్శి తన తదుపరి మూవీ ప్రేమంటే ఈ రోజు రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సందర్భంగా దర్శి ట్విట్టర్ లో ఏవైనా ప్రశ్నలు అడగండి అని పోస్ట్ చేయగా, సినిమాలు ఎందుకు చేస్తున్నావ్ అన్నా, మానెయ్ అని ఒక నెటిజెన్ కామెంట్ చేసాడు. దానికి స్పందిస్తూ దర్శి ” మరి ఏం చేయమంటావ్? గడ్డి పీకాలనా?” అని నవ్వుతున్న ఎమోజి షేర్ చేసాడు.