దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో తన కాంట్రవర్సియల్ ట్వీట్స్ తో ఎప్పుడూ సంచలనాత్మక స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. రీసెంట్ గా రాజమౌళి వారణాసి ఈవెంట్ లో దేవుణ్ణి తాను నమ్మను అని మాట్లాడిన స్టేట్మెంట్ పై సెటైరికల్ గా ఈ విధంగా స్పందించారు. భారతదేశంలో నాస్తికుడు కావడం నేరం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మనకు నమ్మకాన్ని పాటించే హక్కుతో పాటు నమ్మకాన్ని పాటించకూడదనే హక్కును కూడా ఇస్తుంది.
అందుకే రాజమౌళి గారు “నేను దేవుడిని నమ్మను” అని చెప్పే హక్కు ఉన్నట్టే, నమ్మేవారికి “మేము నమ్ముతున్నాం” అని చెప్పే హక్కు ఉంది. ఇప్పుడు “దేవుడిని నమ్మకుండా ఆయన సినిమాల్లో దేవుడిని ఎలా చూపిస్తాడు?” అనే అజ్ఞాన ప్రశ్నకు వస్తే…అలా అయితే గ్యాంగ్‌స్టర్‌పై సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్‌స్టర్ కావాలా? హారర్ సినిమా తీయాలంటే దెయ్యం కావాలా? అతను దేవుడిని నమ్మకపోయినా, దేవుణ్ణి నమ్మేవారికంటే 100 రెట్లు ఎక్కువ పేరు, డబ్బు, అభిమానం రాజమౌళికి ఇచ్చేశాడు!

దేవుడికి రాజమౌళిపై ఎలాంటి సమస్యలు లేకపోతే, స్వయంగా దేవుని ప్రవక్తలైనట్టుగా నటించే వారెందుకు కడుపుమండిపోతున్నారు? అసలు సమస్య ఆయన నాస్తికత్వం కాదు. ఆయన దేవుణ్ణి నమ్మకపోయినా సక్సెస్ కావడం. తాము ఎంత ప్రార్థనలు చేసినా విఫలమవడం. అదే వారి ఈర్ష్యను, అసూయను బయటపెడుతోంది.
దేవుడు బాగానే ఉన్నాడు. రాజమౌళి గారు బాగానే ఉన్నారు. అర్థం చేసుకోలేని వాళ్లకే టెన్షన్. ఇప్పుడు వారణాసి ద్వారా రాజమౌళి గారి బ్యాంక్ బ్యాలెన్స్‌కి మరికొంత పెద్ద మొత్తం జోడించబోతున్నాడు… అసూయపడే వాళ్లు పక్కనే కూర్చొని ఏడ్చుకోవచ్చు. ఇది నమ్మకం పేరుతో దాచుకున్న పచ్చి ఈర్ష్య మాత్రమే. అని ఘాటుగా స్పందించటంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
