Priyamani: అలాంటి రోల్స్ లో నటించాలంటున్న ప్రియమణి.. ఛాన్స్ దొరుకుతుందా?

సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో ప్రియమణి ఒకరు. మరికొన్ని రోజుల్లో భామాకలాపం 2 తో ప్రియమణి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆహా ఓటీటీ వేదికగా భామాకలాపం 2 స్ట్రీమింగ్ కానుండగా ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్ గారికి జోడీగా నటించాలనే కోరిక ఉండేదని చాలా సందర్భాల్లో వెంకటేశ్ గారికి నా మనస్సులోని మాటను చెప్పానని ఆమె అన్నారు.

నారప్ప సినిమాతో వెంకటేశ్ గారితో నటించాలనే కోరిక తీరిందని ప్రియమణి పేర్కొన్నారు. వెంకటేశ్ గారు స్టార్ హీరో అయినప్పటికీ రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారని ఆమె తెలిపారు. వెంకటేశ్ గారు ఇతరులతో చాలా సరదాగా మాట్లాడతారని ప్రియమణి కామెంట్లు చేశారు. అయితే రెండు కోరికలు మాత్రం ఇంకా తీరలేదని ఆ కోరికలు తీరితే మరింత సంతోషంగా ఉంటుందని ప్రియమణి పేర్కొన్నారు.

ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ లో చేయాలని ఉందని ఆ రోల్ తో పాటు నెగిటివ్ రోల్ లో కూడా యాక్ట్ చేయాలని ఉందని ప్రియమణి చెప్పుకొచ్చారు. ఈ తరహా పాత్రల కొరకు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె తెలిపారు. రోల్స్ విషయంలో నాకు ఎలాంటి షరతులు లేవని ప్రియమణి వెల్లడించారు. డైరెక్టర్ ఎలా చెబితే అలా చేస్తానని ఆమె తెలిపారు. నన్ను నమ్మి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా పని అని ప్రియమణి అన్నారు.

ఈ రీజన్ వల్లే సినిమాలు చేయగలుగుతున్నానని ఆమె కామెంట్లు చేశారు. భవిష్యత్తులో నేను కోరుకున్న రోల్స్ వస్తాయని ఫీలవుతున్నానని ఆమె వెల్లడించారు. ఈ రీజన్ వల్లే సినిమాలు చేస్తున్నానని ప్రియమణి చెప్పుకొచ్చారు. ప్రియమణి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రియమణి (Priyamani) పారితోషికం పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది. ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus