Priyamani: భర్త అంటే హీరోయిన్ ప్రియమణికి భయమట.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లలో ప్రియమణి ఒకరు. ప్రియమణి నటించిన భామా కలాపం2 మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. భామాకలాపంను మించి భామాకలాపం2 హిట్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భూమాకలాపం2 ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భామకలాపం2 కోసం రెట్టింపు సాహసం చేశానని ప్రియమణి తెలిపారు. ఈ సినిమాలో నేను సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తానో లేదో భామాకలాపం2 చూసి తెలుసుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు.

రియల్ లైఫ్ లో ఏ వంటకం బాగా వండుతారనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ తెరపైనే కానీ తెర వెనుక నేనేం ఉండనని ప్రియమణి చెప్పుకొచ్చారు. భర్త వండితే బాగా తింటానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం. నిజ జీవితంలో మీ భర్తకు మీరు భయపడతారా అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ కొన్నిసార్లు నేను భయపడతానని కొన్నిసార్లు నా భర్తను భయపెడతానని కామెంట్లు చేశారు.

చాలా కాలం తర్వాత ఈరోజే రవితేజను మీట్ అయ్యానని అప్పుడు ఎంత ఎనర్జిటిక్ గా రవితేజ ఉండేవారో ఇప్పుడూ అలాగే ఉన్నారని ప్రియమణి వెల్లడించారు. ప్రియమణి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియమణి రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. భామాకలాపం2 ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

నాగార్జున తర్వాత సినిమాలో ప్రియమణి (Priyamani) హీరోయిన్ గా నటిస్తున్నారని వార్తలు వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రియమణి తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ప్రియమణి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి. ప్రియమణి కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus