తరుణ్ తో లవ్ ఎఫైర్ పై ప్రియమణి క్లారిటీ!

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్. యూత్ లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అతడు చేసే సినిమాలన్నీ కూడా లవ్ స్టోరీస్ కావడంతో అమ్మాయిల్లో తరుణ్ మంచి క్రేజ్ ఉండేది. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ హీరో గారి చుట్టూ కొన్ని ఎఫైర్లు కూడా నడిచాయి. తన తోటి హీరోయిన్లతో తరుణ్ లవ్ ఎఫైర్స్ నడిపించేవాడంటూ అప్పట్లో వార్తలు బాగా వచ్చేవి. అయితే ఈ లిస్ట్ లో ఎప్పుడూ ప్రియమణి పేరు వినిపించలేదు.

తాజాగా తరుణ్-ప్రియమణిల ఎఫైర్ కూడా బయటకొచ్చింది. ఈ విషయాన్ని బయటపెట్టింది ఎవరో కాదు.. స్వయంగా ప్రియమణి వెల్లడించింది. వీరిద్దరూ కలిసి ‘నవ వసంతం’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయంలో తరుణ్, ప్రియమణి ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వచ్చాయట. తరుణ్ తల్లి రోజారమణి స్వయంగా షూటింగ్ కి వెళ్లి ప్రియమణితో మాట్లాడారట. ఇద్దరూ ప్రేమించుకుంటే చెప్పమని అడిగారట. ఇద్దరికీ పెళ్లి చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా అన్నారట.

రోజారమణి వచ్చి తనను అడిగేవరకు అసలు తరుణ్ కి తనకు సంబంధించిన అలాంటి వార్త ఒకటి వచ్చిందనే విషయం కూడా ప్రియమణికి తెలియదట. ఆ సమయంలో తనకు చాలా నవ్వొచ్చిందని.. వెంటనే అమ్మానాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పి నవ్వుకున్నానని ప్రియమణి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఓ పక్క వెబ్ సిరీస్ లలో నటిస్తూనే మరోపక్క టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతోంది.

Most Recommended Video

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus