Priyamani: ”మా బంధానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు”: ప్రియమణి

  • July 23, 2021 / 01:37 PM IST

నటి ప్రియమణి, ముస్తఫా రాజ్ ల వివాహం చట్టబద్ధమైనది కాదని.. వారి వివాహం చెల్లదంటూ ముస్తఫా మొదటి భార్య అయేషా సంచనల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముస్తఫా తనకు ఇప్పటికే భర్తే అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. తాజాగా అయేషా వ్యాఖ్యలపై ప్రియమణి పరోక్షంగా స్పందించింది. తమది చట్టవిరుద్ధ సంబంధం కాదని.. తమ బంధానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది. ఓ నేషనల్ మీడియాతో మాట్లాడిన ప్రియమణి ఈ రకమైన కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం తన భర్త అమెరికాలో ఉన్నాడని.. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇద్దరం ప్రతిరోజు ఫోన్ లో మాట్లాడుకుంటామని.. ఒకవేళ బిజీగా ఉండి మాట్లాడుకోకపోతే.. కనీసం హాయ్, బాయ్ అయినా చెప్పుకుంటామని తెలిపింది. ఇలా ప్రతిరోజు మేం మాట్లాడుకుంటూనే ఉంటామని.. కొంతమంది మా బంధంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని చెప్పింది. ప్రతీ విషయాన్ని షేర్ చేసుకుంటామని.. ఏ బంధానికైనా అది చాలా అవసరమని ప్రియమణి చెప్పుకొచ్చింది.

2017లో ముస్తఫా.. ప్రియమణిని పెళ్లి చేసుకోకముందే ఆయనకు అయేషాతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ కొన్నేళ్లకే వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరూ విడిపోయారు. అప్పటినుండి ముస్తఫా తన పిల్లలకు కావాల్సినంత డబ్బు పంపిస్తున్నాడు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus