Priyamani: ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ప్రియమణి

  • February 5, 2022 / 09:18 AM IST

సినిమా నాయికలు అంటే సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ తప్పనిసరి. ట్రోలింగ్‌ చేయడమంటే సోషల్‌ స్టేటస్‌ అనుకునేంతగా నెటిజన్లు తమ కామెంట్లు, మీమ్స్‌తో విరుచుకుపడుతుంటారు. వీటికి లేనిపోని పుకార్లు అదనం. పెళ్లి లాంటి వ్యక్తిగత విషయాల్లోనూ ఈ ట్రోలింగ్‌, లేనిపోని చర్చ, అవసరమైన రగడ ఎక్కువైపోతున్నాయి. ఇటీవల ఇలాంటి ఇబ్బంది పడుతున్న కథానాయికలు, నటీమణులు ఎక్కువైపోయారు. అలాంటివారిలో నటి ప్రియమణి ఒకరు. తన వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని నెలలుగా ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంది.

Click Here To Watch

ఇటీవల ఆ ట్రోలింగ్స్‌పై, నెగిటివిటీపై ప్రియమణి స్పందించింది. మరికొన్నిరోజుల్లో ‘భామాకలాపం’ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ప్రియమణి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భామాకలాపం’లోని అనుపమ పాత్రకు.. తన నిజజీవితానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వ్యక్తిగతంగా తాను ఎంతో సైలెంట్‌ అని వెల్లడించారు. ‘‘భామాకలాపం’లో అనుపమ పాత్ర చాలా సరదాగా ఉంటుంది. పక్కింట్లో ఏం జరుగుతోంది? పొరుగింటి వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారు? అనే విశేషాలపై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటుంది. అనుపమకు వంట చేయడం బాగా వచ్చు. అనుపమ పాత్రకు నా వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదు.

ఎందుకంటే, రియల్‌లైఫ్‌లో నాకు వంట చేయడం రాదు. నా భర్త వండి పెడితే బాగా తింటాను. ఎక్కువశాతం ఇంట్లో ఉండటానికే ఆసక్తి కనబరుస్తాను. బయటవాళ్ల విషయాలు నేను పట్టించుకోను’’ అని చెప్పారు. నెగిటివ్‌ కామెంట్స్‌ని మీరెలా ఎదుర్కొంటారు అని ఆమెను అడిగితే… నేను అలాంటి కామెంట్స్‌ని అస్సలు పట్టించుకోను అని తేలిగ్గా సమాధానమిచ్చింది. అంతేకాదు నాకు అవసరం లేని ఏ విషయాన్నైనా ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తా అని కూడా చెప్పింది.

ట్రోలింగ్స్‌, నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చిన ప్రతిసారీ స్పందిస్తే ఆ వ్యాఖ్యలకు మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందని ఆమె ఆలోచనట. ఇలానే నెగిటివిటీ, ట్రోలింగ్‌ని ఎదుర్కొంటున్నా అని చెప్పింది ప్రియమణి. నా గురించి ఎలాంటి వార్తలు వచ్చినా నా కుటుంబానికి, భర్తకు మాత్రమే నేను జవాబుదారీని. మిగిలిన ప్రపంచానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఖరాకండీగా తేల్చి చెప్పేసింది ప్రియమణి. ఇక ఆమె కెరీర్‌ గురించి చూస్తే… పెళ్లికి ముందు కెరీర్‌ బాగా స్లో అయ్యింది. అయితే వివాహం తర్వాత చూస్తే వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఆమె ప్రధానపాత్రలో నటించిన ‘భామాకలాపం’.‘ఆహా’ వేదికగా త్వరలో విడుదల కానుంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus