Bigg Boss 5 Telugu: మజాక్ లోనే చెప్పినా, ప్రియాంక ఉద్దేశ్యం ఇదేనా..?

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ చెప్పే మాటలకి చాలా అర్ధాలని వెతుకుతారు ఆడియన్స్. ముఖ్యంగా ఏదైనా ఆర్గ్యూమెంట్ అయినా, లేదా కంటెస్టెంట్స్ ఓవర్ కాన్ఫిడెంట్ గా కనిపించినా ఇట్టే పట్టేస్తారు. అంతేకాదు, ఓవర్ యాక్షన్ చేసే కంటెస్టెంట్స్ ని కూడా గుర్తించి వారిని ఎలిమినేట్ చేసేదాకా నిద్రపోరు. అయితే, ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో 50రోజులు గడిచిపోయాయి. అంటే సగం బిగ్ బాస్ అయిపోయింది. అయినా కూడా ఇంతవరకూ ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా ఆడియన్స్ కి దగ్గరకాలేకపోయారనే చెప్పాలి.

హౌస్ మేట్స్ మాత్రం వారి గేమ్ ని ఎనలైజ్ చేస్కుంటూ స్ట్రాటజీలని అప్లై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక మజాక్ లో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బెడ్ రూమ్ లో కూర్చున్న ప్రియాంక సిరితో మానస్ తో కాసేపు మచ్చట్లు పెట్టింది. ఈసారి నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. అందులో అమ్మాయి నువ్వు ఒక్కదానివే అని చెప్పింది. అయితే, అక్కడే ఉన్న సిరి పింకీ ఈసారి నువ్వు లేవు కదా అంటూ మాట్లాడింది.

వెంటనే పింకీ నేను మానస్ టాప్ 5లో ఉంటామని, మానస్ విన్నర్ అవుతాడు అంటూ మాట్లాడింది. దానికి సిరి నవ్వుతూ మేమేంటి మరి అడుక్కోవాలా అంటూ కౌంటర్ వేసింది. మా పక్కన మీ ముగ్గురు కూడా ఉంటారులే అని ప్రియాంకి మాజాక్ లోనే రీకౌంటర్ వేసింది. ఇక్కడే కాసేపు సిరికి పింకీకి కౌంటర్స్ నడిచాయి. అంకుల్స్ అంతా బయటకి వెళ్లిపోవాలి. కుర్రాళ్లంతా లోపలే ఉండాలని మానస్ చెప్తుంటే, ఒకవేళ ఆంటీలు బయటకి పోవాలంటే పింకీ వెళ్తుందని సిరి కౌంటర్ వేసింది.

ఇక్కడే ముఖం పగిలిపోద్దని స్వీట్ వార్నింగ్ ఇస్తూ నవ్వుతూ చెప్పింది పింకీ. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడీయాలో వైరల్ అయ్యాయి. పీంకీ చెప్పినట్లుగానే తను టాప్ 5లో ఉంటుందా.. అసలు టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది ఆడియన్స్ కి ఆసక్తిగా మారింది.

[yop_poll id=”4″]

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus