నా పర్సనల్ లైఫ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు

బాలీవుడ్ కమ్ హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా వివాహం గురించి ఇప్పటికే బోలెడన్ని కథనాలు మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఆల్రెడీ ఈ ఇద్దరికీ నిశ్చితార్ధం జరిగిపోయిందని, త్వరలోనే ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.  ఇందుకోసం ప్రియాంక చోప్రా భారత్ సినిమా నుంచి తప్పుకుందని కూడా వార్తలు వెలువడ్డాయి.  మొన్నటివరకు ప్రియాంక మీడియాలో వస్తున్న వార్తలపై పెద్దగా స్పందించలేదు. గతంలో ఒకసారి ఈ విషయంపై సూటిగా వివరణ ఇచ్చింది. తన పర్సనల్ లైఫ్ గురించి బయటి వ్యక్తులకు చెప్పాల్సిన అవసరం లేదని ఒకసారి పేర్కొన్నది.  ప్రియాంక, నికి జోనస్ రిలేషన్ షిప్స్ పై ప్రియాంకను గుచ్చిగుచ్చి అడగడంతో ప్రియాంక మరోసారి స్ట్రైట్ గా సమాధానం ఇచ్చింది.

సెలబ్రిటీ కంటే మొదట తానొక ఆడపిల్లనని, తన జీవితంలో 90% పబ్లిక్ లైఫ్ ఉంటె, 10% పర్సనల్ లైఫ్ ఉంటుందని, తన పర్సనల్ లైఫ్ గురించి పదిమందికి చెప్పాల్సిన అవసరం లేదని కరాఖండిగా చెప్పింది.  ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి తాను ఎవరిదగ్గర పనిచేయడం లేదని చెప్పింది ప్రియాంక.  సోమవారం ఉదయం ప్రియాంక ఎఫ్ఐసిసిఐ లేడీస్ ఆర్గనైజషన్, ఎస్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న చాలెంజింగ్ ది స్టేటస్ క్వా అండ్ ఫర్జింగ్ న్యూ పాత్ అనే ప్రోగ్రామ్స్ లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చింది. ఈ కార్యక్రమం అనంతరం ప్రియాంక తన వివాహంపై వస్తున్న రూమర్ల గురించి పైవిధంగా స్పందించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus