Priyanka Chopra,Nick Jonas: భర్తతో ప్రియాంక ఫన్నీ వీడియో..!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ నుంచి విడిపోతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నేషనల్ మీడియాలో ఇదొక హాట్ టాపిక్ అయింది. దానికి కారణం ఏంటంటే.. ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి నిక్ జోనాస్ పేరుని తొలగించడమే. దీంతో నెటిజన్లు షాకయ్యారు. ప్రియాంక కూడా సమంత రూట్ లో విడాకులు తీసుకోబోతుందంటూ మాటలు వినిపించాయి. ఈ వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే ప్రియాంక తల్లి అవి పుకార్లను తేల్చేసింది.

అయితే తాజాగా ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది ప్రియాంక. తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో నిక్ జోనాస్ ను తన కామెంట్స్ తో ఆడేసుకుంది. నిక్ జోనాస్ కు, ఆయన సోదరుల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ తనకే ఉన్నారని చెప్పింది ప్రియాంక. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వేదికగా జరిగిన జొనాస్‌ బ్రదర్స్‌ ఫ్యామిలీ రోస్ట్ అనే షోలో జొనాస్‌ కుటుంబం పాల్గొంది. జోనాస్ బ్రదర్స్ తో పాటు వారి భార్యలు కూడా ఈ షోకి వచ్చారు.

ప్రముఖ కమెడియన్‌ కెనన్‌ థాంప్సన్‌ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ షో ప్రియాంక చాలా విషయాల గురించి మాట్లాడింది. నిక్ తనకంటే పదేళ్లు చిన్నవాడిని.. మేమిద్దరం చాల విషయాలు మాట్లాడుకుంటామని.. నిక్ పై తనకు చాలా ప్రేమ ఉందని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విడాకుల రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడింది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!


టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus