Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధరించిన చీర ఖరీదు ఏకంగా అన్ని వేలా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రియాంక చోప్రా తాజాగా అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు. పసుపు రంగు సాంప్రదాయ దుస్తుల్లో ప్రియాంక చోప్రా స్వామివారిని దర్శించుకోగా ఆమెకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ప్రియాంక చోప్రా ధరించిన శారీ చాలా సింపుల్ గా ఉందని కామెంట్లు వినిపించాయి. ఈ చీర ఖరీదు ఏకంగా 63 వేల 800 రూపాయలు అని తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.

పూర్తిగా ఆర్గానిక్ మెటీరియల్ తో ఈ చీరను తయారు చేశారని అందువల్లే ఈ చీర ఖరీదు చాలా ఎక్కువని సమాచారం అందుతోంది. ఈ చీర కోసం వాడిన రంగులు, ఫ్యాబ్రిక్ కూడా ఆర్గానిక్ కావడం గమనార్హం. ప్రియాంక చోప్రా హిందూ సాంప్రదాయం పాటిస్తూ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రియాంక చోప్రాతో పాటు ఆమె భర్త, కూతురు సైతం బాలరాముడిని దర్శించుకోవడం గమనార్హం. మీరాచోప్రా (Meera Chopra) పెళ్లి కొరకు ప్రియాంక చోప్రా ఇండియాకు వచ్చారని తెలుస్తోంది.

ప్రియాంక చోప్రా ధరించిన చీరను పది రోజుల పాటు కష్టపడి తయారు చేశారని సమాచారం అందుతోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారనే సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉంది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ ప్రాజెక్ట్ లలో సైతం నటిస్తూ అక్కడ కూడా సత్తా చాటుతున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రియాంక చోప్రా సత్తా చాటుతున్నారు.

త్వరలోనే భర్త, పిల్లలతో కలిసి ప్రియాంక చోప్రా లాస్ ఏంజెల్స్ కు వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. ప్రియాంక చోప్రాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రియాంక చోప్రా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus