Priyanka, Alia: చాలా సంవత్సరాల తర్వాత ఇండియాలో అడుగుపెట్టిన గ్లోబల్ బ్యూటీ?

బాలీవుడ్ నటి, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనంతరం హాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుని 2017 వ సంవత్సరంలో హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ విధంగా హాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న ప్రియాంక చోప్రా పాప్ సింగర్ నిక్ జోనాస్ ను వివాహం చేసుకొని లాస్ట్ ఏంజెల్ లో నివాసం ఉంటున్నారు.

ఈ విధంగా 2018 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా అప్పటినుంచి అమెరికాలోనే స్థిరపడ్డారు. ఇలా వివాహం జరిగిన తర్వాత ప్రియాంక చోప్రా మొదటిసారిగా ఇండియాకి వచ్చారు. ఇలా ఈమె ముంబై ఎయిర్పోర్టులోకి అడుగుపెట్టగానే అభిమానులు పెద్ద ఎత్తున ఈమెకు స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత ప్రియాంక చోప్రాను చూడటంతో అభిమానులు ఎంత సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే ముంబై ఎయిర్ పోర్టులో మీడియాకి ఈమె కనిపించగానే ఒక్కసారిగా కెమెరాలన్నీ తనని ఫోకస్ చేశాయి.

అదే విధంగా ఎంతో మంది అభిమానులు ప్లకార్డులతో తనకు స్వాగతం పలికారు. ఇకపోతే ఈమె ఎయిర్పోర్ట్ నుంచి కారులో వెళ్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు ఈమెను అలియా భట్ ప్రెగ్నెన్సీ గురించి ప్రశ్నించారు. ఈ విధంగా ఫోటోగ్రాఫర్లు ప్రియాంక చోప్రా కారు వద్దకు వెళుతున్న సమయంలో అలియా ప్రెగ్నెన్సీ గురించి ప్రశ్నించడంతో ఆ ప్రశ్న విన్నటువంటి ప్రియాంక చోప్రా ఈ విషయంపై ఏ మాత్రం స్పందించకుండా కేవలం చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

ఇలా ప్రెగ్నెన్సీ గురించి ఈమె కేవలం నవ్వుతూ వెళ్లిపోవడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయినా తనతో పాటు నటిస్తున్నటువంటి సహనటి అలియా ప్రెగ్నెన్సీ వార్తలు గురించి స్పందించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఇది సంతోషకరమైన వార్త అనేలా ఈమె చిరునవ్వు నవ్వి వెళ్లిపోయారు. ఇక చాలా సంవత్సరాలు తర్వాత ప్రియాంక చోప్రా ముంబైకి రావడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus