RRR: ఆర్ఆర్ఆర్ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక చోప్రా!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈమె హాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈమె నటించిన ఒక వెబ్ సిరీస్ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ వెబ్ సీరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ప్రియాంక మాట్లాడుతూ పలు విషయాల గురించి తెలిపారు.

ఈ క్రమంలోనే ఈమె రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా యాంకర్ ఈమెను ప్రశ్నిస్తూ మీరు RRR సినిమా చూశారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ప్రియాంక సమాధానం చెబుతూ నాకు ఆ సినిమా చూసే అంత సమయం లేదని తెలిపారు. ఇలా రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టత్మకంగా వచ్చిన ఈ సినిమా ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న చిత్ర బృందానికి ప్రియాంక ఆతిథ్యం ఇచ్చారు. ఇలా ఈ సినిమా టీమ్ కి ఆతిథ్యం ఇచ్చిన ప్రియాంక చోప్రా చూడలేదని చెప్పడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఆస్కార్ సాధించిన RRR ఇండియా సినిమా గురించి ప్రియాంక చోప్రా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పడంతో పెద్ద ఎత్తున ఈమెపై ట్రోల్ చేస్తున్నారు.

హీరోయిన్ అయ్యుండికొని ఆస్కార్ సాధించిన ఒక ఇండియన్ సినిమాని చూడటానికి కనీసం మూడు గంటలు సమయం కేటాయించలేకపోవడం ఏంటి అంటూ ట్రోల్ చేస్తున్నారు.అయితే ఈమె సినిమాలను పెద్దగా చూడనని, ఎక్కువగా టీవీ షోలు మాత్రమే చూస్తాను అంటూ చెప్పుకొచ్చారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus