రీసెంట్ గా సుప్రీం కోర్ట్ జారీ చేసిన ‘ప్రచారకర్తలదే బాధ్యత’ అనే నోటీసును కాస్త సీరియస్ గా తీసుకొందో లేక నిజంగానే భారతదేశ ప్రభుత్వాన్ని, ప్రజలను దారుణంగా మోసం చేసిన నిరవ్ మోడీ అంటే అయిష్టతతో చేసిందో తెలియదు కానీ.. బాలీవుడ్ బాక్శమ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఉన్నపళంగా తాను నిరవ్ మోడీకి చెందిన ఓ సంస్థకు చేస్తున్న ప్రచారకర్త హోదాకు రిజైన్ చేసింది. ఈమేరకు అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకొంది.
నీరవ్ మోదీ వజ్రాల సంస్థ ఫైర్‌స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంకా చోప్రా ఇప్పుడు ఆ కంపెనీతో తన కాంట్రాక్టును వదులుకున్నది. ఈ విషయాన్ని హీరోయిన్ తరపున ఆమె ప్రతినిధి తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు నీరవ్ మోదీ సంస్థ సుమారు 1100 కోట్లు ఎగ్గొట్టింది. ఆ కేసులో విచారణ కొనసాగుతున్నది. అయితే ఆ కంపెనీ ఆభరణాలకు ప్రియాంకా గతంలో ప్రమోషన్ చేసింది. తనకు రావాల్సిన అమౌంట్‌ను కూడా నీరవ్ ఇవ్వలేదని ఇటీవల ప్రియాంకా పేర్కొన్న విషయం తెలిసిందే.