”నా బాడీని చూసి సర్జరీ చేయించుకోమన్నారు”!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా ఆ తరువాత హాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకొని అక్కడ కూడా నటించడం మొదలుపెట్టింది. కొన్నాళ్లకు హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం కొన్ని ఇండియన్ ప్రాజెక్ట్ లు చేస్తూనే.. హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ తన ఆత్మకథను విడుదల చేస్తోంది. ‘Unfinished’ అనే పేరుతో తన ఆటోబయోగ్రఫీను త్వరలోనే మార్కెట్ లో రిలీజ్ చేయనుంది.

కెరీర్ ఆరంభంలో తన అవయవ సౌష్టవం గురించి కొందరు నిర్మాతలు, దర్శకులు చేసిన కామెంట్లు కూడా ఇందులో రాసుకుంది. తన ఫిజికల్ అప్పియరెన్స్ మీదనే కెరీర్ ఆధారపడి ఉందని.. కానీ మొదలుకాకుండానే ముగిసిపోయిందనిపించిందని.. స్వర్గానికి తలుపులు తెరిచినట్లే తెరుచుకొని తన మొహం మీదే మూసేసిన ఫీలింగ్ కలిగిందని చెప్పింది. అలాంటి చేదు అనుభవాలు మొదట్లో ఎదురయ్యాయని.. ఎంతో బాధపడ్డానని తన అనుభవాల గురించి రాసుకొచ్చింది. అలానే కెరీర్ ఆరంభంలో ఓ సినిమా ఆఫీస్ కి వెళ్లగా..

అక్కడ దర్శకనిర్మాతలు తనను అటు, ఇటు తిరగమని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంది. తన బాడీని చూసి వక్షోజాలు చిన్నగా కనిపిస్తున్నాయని.. అలానే పిరుదులు కొంచెం పెద్దగా ఉన్నాయని.. సర్జరీ చేయించుకోమని చెప్పిన విషయాన్ని బయటపెట్టింది. అందగత్తెగా గెలిచి వచ్చిన తనను సర్జరీ చేయించుకోమని చెప్పడంతో కుంగిపోయానని తను ఎదుర్కొన్న అనుభవాలని ఆత్మకథలో పొందుపరిచిందట.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus