పెళ్లికి ముందు ప్రియాంక ఇలా చేస్తుందేంటి ?

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన కన్నా పదేళ్ల చిన్నవాడైన అమెరికా సింగర్ నికో జోనస్‌ తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచి నిక్ తో కలిసి తిరుగుతున్న ప్రియాంక చోప్రా.. ఇటీవల ఆకాశ్ అంబానీ నిశ్చితార్థ వేడుకల్లోనూ కనిపించింది. వీరిద్దరికి జూలై 18న నిశ్చితార్థం జరిగిందని అమెరికా మీడియా వెలుగులోకి తెచ్చింది. ప్రియాంక చోప్రా 36వ పుట్టినరోజు సందర్భంగా.. ఖరీదైన ఉంగరాన్ని ఆమె చేతివేలికి నిక్ జోనస్ తొడిగినట్లు వెల్లడించింది. తాజాగా ఈ ఇద్దరూ సెప్టెంబరు 16న వివాహ బంధంతో ఒకటవబోతున్నట్లు తెలిసింది.

నిక్ జోనస్‌ 1992, సెప్టెంబరు 16న జన్మించగా.. అతని పుట్టినరోజు సందర్భంగా పెళ్లి చేసుకుని స్థిరపడాలని చూస్తున్నారు. అందుకే ప్రియాంక… సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో తెరకెక్కే ‘భరత్’ నుంచి  తప్పుకుంది.  ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన క్వాంటికో సిరీస్ లో ప్రియాంక  హాట్ గా నటిస్తోంది. తాజాగా ఈ సీరీస్ లో తోటి నటుడికి ఇచ్చిన లిప్ కిస్ సంచలనంగా మారింది. వైరల్ అయింది. ఎంగేజ్ మెంట్ అయిపోయి పెళ్లికి రెడీ అవుతోన్న ఈ సమయంలో ప్రియాంక ఇలా చేస్తుందేమిటి? అని బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. దీనిని బట్టి చూస్తే పెళ్లి తర్వాత కూడా ఇటువంటి సన్నివేశాల్లో నటించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus