తెలుగులో సీరియల్ నటీమణులకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వెండితెర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని క్రేజ్ వీరికి సొంతం. అలా తన యాక్టింగ్, క్యూట్ లుక్స్‌తో బుల్లితెరపై స్టార్ స్టేటస్ అందుకుంది ప్రియాంక జైన్(Priyanka Jain). ముఖ్యంగా ‘మౌనరాగం’ సీరియల్‌లో అమ్ములు పాత్రతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరైంది. ఆ తర్వాత ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో ఆమె పాపులారిటీ పీక్స్‌కి వెళ్లింది.
ఆ క్రేజ్‌తోనే బిగ్ బాస్ సీజన్ 7లో అడుగుపెట్టి, స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా టాప్-5లో నిలిచింది.అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక ప్రియాంక మళ్లీ సీరియల్స్‌లో కనిపించలేదు. ప్రస్తుతం పూర్తిగా సోషల్ మీడియాకే పరిమితమైంది. తన బాయ్ ఫ్రెండ్ శివశంకర్‌తో కలిసి రీల్స్, వ్లాగ్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని గ్లామరస్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అసలు సీరియల్స్ ఎందుకు మానేసింది అనే విషయంపై ప్రియాంక రీసెంట్‌గా క్లారిటీ ఇచ్చింది. సీరియల్స్ చేస్తే ఏళ్ల తరబడి ఒకే పాత్రకు పరిమితం అయిపోతానేమో అనే భయం తనలో ఉందట. ఒకే రోల్‌లో బందీ అవ్వడం ఇష్టం లేక, కాల్ షీట్లు అడ్జస్ట్ చేయడం కష్టమని భావించి సీరియల్స్‌కు దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. మోడలింగ్ సమయంలో తన హైట్‌పై కామెంట్స్ వచ్చినా, సీరియల్సే తనకు లైఫ్ ఇచ్చాయని గుర్తు చేసుకుంది.