Priyanka Mohan: సినిమాలలోకి రాకముందు చీప్ పనులు చేశాను!: ప్రియాంక మోహన్

ప్రియాంక మోహన్ పరిచయం అవసరం లేని పేరు ఈమె కెరియర్ మొదట్లో తమిళ సినిమాలలో నటించిన అనంతరం తెలుగులో నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమాలో కూడా నటించే ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఈమె తెలుగులో పలు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నటువంటి ఓ జి సినిమాలో కూడా అవకాశం అందుకున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీలోకి రాకముందు తాను ఏం చేసేవారు అనే విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రియాంక మోహన్ మాట్లాడుతూ మా కుటుంబం ఆర్థికంగా ఉన్నత కుటుంబం కాదు మేము మా అవసరాల కోసం ఎన్నో ఇబ్బందులు పడే వాళ్ళమని ఈమె తెలియజేశారు.

చిన్నప్పటి నుంచి నాకు సినిమాలలోకి రావాలని ఆశక్తి ఉండేది అందుకే ఆ దిశగా ప్రయత్నాలు చేసామని తెలిపారు. కుటుంబ అవసరాలను తీర్చడం కోసం డబ్బు సంపాదించాలని ఎన్నో చీప్ పనులను కూడా చేశానని ఈమె ఈ సందర్భంగా తెలియజేశారు. దీంతో ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని చీప్ యాడ్స్ చేశానని వాటి ద్వారా నాకు పెద్దగా డబ్బు కూడా వచ్చేది కాదని ఈమె తెలిపారు.

ఈ యాడ్స్ చేయడం ద్వారా వచ్చే డబ్బు వడ్డీలకు సరిపోయేవి అంటూ ఈ సందర్భంగా ప్రియాంక మోహన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ గా మారడంతో పలువురు ఈమె వ్యాఖ్యలపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరి ఈమె ఎలాంటి యాడ్స్ చేశారనే విషయాన్ని మాత్రం తెలియచేయలేదు. ఇలా మెల్లిమెల్లిగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నటువంటి ఈమెకు (Priyanka Mohan) ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus