Priyanka Singh: ఐదేళ్ల వయస్సులోనే నా స్థితి అర్థమైంది.. ప్రియాంక సింగ్ కామెంట్స్ వైరల్!

మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలెంట్ ఉన్నవాళ్లను ప్రోత్సహించడంలో, ఎవరైనా కష్టాల్లో ఉంటే తన వంతు సహాయం చేయడంలో నాగబాబు ముందువరసలో ఉంటారు. జబర్దస్త్, బిగ్ బాస్ షోల ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న ప్రియాంక సింగ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగబాబు గొప్పదనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదు సంవత్సరాల వయస్సులోనే నా స్థితి నాకు అర్థమైందని అక్క, చెల్లి యూనిఫాం వేసుకోవడానికి ఆసక్తి ఉండేదని ప్రియాంక సింగ్ పేర్కొన్నారు.

పదో తరగతి తర్వాత ఒక కన్నడ మూవీలో లేడీ గెటప్ వేశానని ఆమె తెలిపారు. చెల్లి పెళ్లి చేసి కుటుంబ కష్టాలు తీరిన తర్వాతే అమ్మాయిలా మారిపోయానని ప్రియాంక సింగ్ కామెంట్లు చేశారు. ఆపరేషన్ తర్వాత ఆర్థరైటిస్ వల్ల ఏడాది పాటు మంచానికే పరిమితమయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నాగబాబు నెలనెలా డబ్బులు ఇచ్చారని ప్రియాంక సింగ్ కామెంట్లు చేశారు. నాగబాబు రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ఆయన దేవుడని ప్రియాంక సింగ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాగబాబు కారణమని ఆమె తెలిపారు. ప్రస్తుతం నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందని పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయని ప్రస్తుతానికి పెళ్లిపై ఆలోచన లేదని కామెంట్లు చేశారు. నాకోసం ఏదో మంచిది రాసిపెట్టుందని అందుకే దేవుడు బ్రతికిస్తున్నాడని భావించానని ఆమె తెలిపారు. దేవుడిని నమ్ముతానని మందు తాగడం బ్రీజర్ తో మొదలుపెట్టానని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమాలో చేస్తున్నానని హాట్ స్టార్ లో హీరోయిన్ గా లాంఛ్ కాబోతున్నానని ఆమె పేర్కొన్నారు. సినిమాలతో పాటు హీరోయిన్ గా చేస్తున్నానని భవిష్యత్తులో ఫుడ్ బిజినెస్ చేయాలని ఉందని ప్రియాంక సింగ్ వెల్లడించారు. ప్రియాంక సింగ్ (Priyanka Singh) కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus