ఇదివరకూ పెళ్లి ఫోటోలు తప్పితే ఒక జంటకి ఆల్బమ్ లో పెట్టడానికి ఏవీ ఉండేవి కావు. అలాంటిది ఈమధ్యకాలంలో పెళ్ళికి ముందు టీజర్ అనీ, పెళ్లి తర్వాత యానివర్సరీ అనీ, ఇలా రకరకాల ఫోటోషూట్ లు చేసుకొని డిజిటల్ ఆల్బమ్స్ తయారు చేసుకొంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కొత్తగా హనీమూన్ ఫోటోషూట్ ఒకటి వచ్చి చేరింది. జపాన్ లో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు హాలీవుడ్ కి పాకింది.
ఈ రకమైన ఫోటోషూట్ చేయించుకొన్న మొట్టమొదటి బాలీవుడ్ సెలబ్రిటీగా ప్రియాంక చోప్రా నిలిచింది. భర్త నిక్ జోనస్ తో కలిసి ప్రియాంక చేయించుకున్న హనీమూన్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. సూపర్ హాట్ గా ఉన్న ఫోటోస్ చూసి ప్రియాంక స్నేహితులు మాత్రమే కాక ఆమె అభిమానులు కూడా విస్తుబోతున్నారు. ఈ రోమాంటిక్ ఫోటోస్ ఆర్జీవీ సినిమాల్లోని రోమాంటిక్ స్టిల్స్ కంటే హాట్ గా ఉండడమే ఇందుకు కారణం.