బెట్టింగ్ యాప్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు మొదలుపెట్టాక.. ఆ కథ సినిమా పరిశ్రమకు చిన్నపాటి షాకే ఇచ్చింది. బెట్టింగ్ యాప్‌లకు గతంలో ప్రచారం చేసిన కొంతమంది నటులకు నోటీసులు వచ్చాయి. ఈ క్రమంలో ఈడీ తన విచారణను వేగవంతం చేసింది. వివిధ రాష్టాల్లో నమోదైన బెట్టింగ్ యాప్ కేసులన్నీ ఒక దగ్గరకు చేర్చి చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ప్రచారం చేసిన నటుల ఆస్తులను అటాచ్ చేసింది. ఇటీవల బాలీవుడ్ నటుల ఆస్తులు ఇలానే అటాచ్ అయ్యాయి.
Vijay and Rana
అయితే, ఇప్పుడు సమస్య ఏంటంటే.. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలుగు రాష్ట్రాల్లోనూ చేస్తుందా అని. ఎందుకంటే బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వ్యవహారంలో టాలీవుడ్ నటులు, అగ్ర హీరోలు కొంతమంది ఉన్నారు. వారిని ఇప్పటికే ఈ కేసు విషయంలో విచారించారు కూడా. అందులో ప్రముఖ నటుడు, నిర్మాత రానా, యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ లాంటివాళ్లు కూడా ఉన్నారు. దీంతో వీరి ఆస్తులు కూడా ఈడీ అటాచ్ చేస్తుందా అనే చర్చ మొదలైంది.
ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు అటాచ్ అయిన నటులు చూస్తే.. సోనూ సూద్, ఊర్వశి రౌతేలా, నేహా శర్మ లాంటి పేర్లు కనిపిస్తున్నాయి. వీళ్లు మాత్రమే కాకుండా మిమీ చక్రవర్తి, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప కూడా ఉన్నారు. అంతకుముందు శిఖర్ ధావన్, సురేశ్ రైనా ఆస్తుల్ని కూడా ఈడీ అటాచ్ చేసింది. ఇదే పని తెలుగు రాష్ట్రాల్లో కూడా చేస్తే.. విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా, మంచు లక్ష్మి లాంటి సెలబ్రిటీలకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే నార్త్ సెలబ్రిటీల ఆస్తులు అటాచ్ అయిన కేసుల్లో సౌత్ వాళ్లెవరూ లేరు అని సమాచారం.
అయితే ఆ యాప్‌ల విషయంలో తీసుకున్న నిర్ణయమే టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఎదుర్కొంటున్న కేసుల విషయంలోనూ తీసుకుంటే అప్పుడు మనవారికీ ఇబ్బందే.