Allu Aravind: ‘తండేల్’ కోసం రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ పోస్ట్ పోన్?

సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో దిల్ రాజు (Dil Raju) వార్తల్లో నిలవడం ఆనవాయితీగా వస్తోంది. తన బ్యానర్ నుండి సినిమాలు వచ్చినా రాకపోయినా, ఆయన పంపిణీ చేసే సినిమాలకి థియేటర్లను హోల్డ్ చేస్తూ ఆయన వార్తల్లో నిలుస్తుంటారు. ఈ సంక్రాంతికి ఏకంగా రెండు సినిమాలను బరిలోకి దింపాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారు. అందులో ఒకటి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  ఇంకోటి ‘సంక్రాంతికి వస్తున్నాం’. జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’, జనవరి 14 న ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) విడుదల చేయాలన్నది దిల్ రాజు ప్లాన్.

Allu Aravind

మరోపక్క బాబీ (Bobby) – బాలయ్య  (Balakrishna)  సినిమా కూడా జనవరి 12 న రిలీజ్ కానుంది. దీనిని కూడా నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది దిల్ రాజే..! సో ప్రాబ్లం లేదు. మరోపక్క అజిత్ సినిమాని ‘మైత్రి’ వాళ్ళు విడుదల చేసుకోవాలని చూస్తున్నారు. దాంతో కూడా పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. అయితే సంక్రాంతికి ‘తండేల్’ (Thandel) కూడా రిలీజ్ అవుతుందని టాక్ వచ్చింది. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసే ‘తండేల్’ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నట్టు దర్శకుడు చందూ మొండేటి  (Chandoo Mondeti)  చెప్పుకొచ్చాడు.

‘రాంచరణ్ (Ram Charan) సినిమా కోసం అల్లు అరవింద్ (Allu Aravind) వాయిదా వేస్తే తప్ప మా సినిమా వాయిదా పడదు’ అంటూ అతను చెప్పుకొచ్చాడు.సంక్రాంతి టైంకి రిలీజ్ అయితే కచ్చితంగా ‘తండేల్’ బిగ్ నంబర్స్ చేస్తుంది అనేది టీం నమ్మకం. అందుకోసం అల్లు అరవింద్ రంగంలోకి దిగారట. ఈ విషయమై దిల్ రాజుతో చర్చలు జరుపుతున్నట్టు ఇన్సైడ్ టాక్. అల్లు అరవింద్ కూడా దిల్ రాజుకి ఏమాత్రం తీసిపోని డిస్ట్రిబ్యూటర్.

పంతానికి పోతే ఆయన ఆంధ్రాలో ఎక్కువ థియేటర్స్ హోల్డ్ చేయగల సత్తా ఉన్నవారే. అయితే అల్లు అరవింద్ పట్టుబడితే పోస్ట్ పోన్ అయ్యేది ఎక్కువ శాతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చెప్పాలి. కానీ టైటిల్ ని బట్టి చూస్తే.. ఆ సినిమాని పోస్ట్ పోన్ చేయడం కష్టం. మరి ఈ నేపథ్యంలో ఏమవుతుందో తెలియాల్సి ఉంది.

‘అదుర్స్’.. ఎన్టీఆర్ అలా చేశాడు కాబట్టే కామెడీ పండింది : కోన వెంకట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus