AM Ratnam: పవన్ గొప్పదనం చెప్పిన ప్రముఖ నిర్మాత.. ఏమైందంటే?

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన ఏఎం రత్నంకు పవన్ తో మంచి అనుబంధం ఉంది. పవన్ ఏఎం రత్నం కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కాయనే సంగతి తెలిసిందే. పవన్ స్టార్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి 27 సంవత్సరాలు కాగా జనసేన పార్టీని మొదలుపెట్టి 10 సంవత్సరాలు అవుతోంది. అయితే ఏఎం రత్నం తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మనస్సు ప్రజలపై ఉంటే తనువు వెండితెరపై ఉందని ఆయన తెలిపారు.

పవన్ కళ్యాణ్ మంచితనాన్ని, గొప్పదనాన్ని చెబుతూ ఆయన కామెంట్లు చేశారు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ పవన్ ప్రజల మనస్సు గెలుచుకున్నారని ఆయన అన్నారు. 27 ఏళ్ల సినీ జీవితం, తొమ్మిదేళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న పవన్ కు శుభాకాంక్షలు అని పవన్ ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఏఎం రత్నం అన్నారు. పవన్ ఏఎం రత్నం కాంబినేషన్ లో హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతోంది.

జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. పవన్ ప్రస్తుతం వినోదాయ సిత్తం రీమేక్ షూట్ లో పాల్గొంటున్నారు. వచ్చే నెల నుంచి పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూట్ లో పాల్గొననున్నారు. హరిహర వీరమల్లు ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కానుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ మూవీ బడ్జెట్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పవన్ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి త్వరలో అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతి సినిమా సక్సెస్ సాధించడంతో పాటు పవన్ ఇమేజ్ ను, పవన్ మార్కెట్ ను మరింత పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ పారితోషికం 75 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus