సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలుగా నటీనటులుగా కొనసాగుతున్నటువంటి వారు హిట్ సినిమాలను ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొక తప్పదు. కొన్ని సినిమాలు ఊహించని దానికన్నా విజయం సాధించి మంచి లాభాలను పొందితే మరికొన్ని సినిమాలు ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ డిజాస్టర్ ఎదుర్కొంటాయి. ఇలా సినిమాలు డిజాస్టర్ అయితే నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా నష్టాల కారణంగా చాలామంది నిర్మాతలు ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ ద్వారా ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు నిర్మాత అశ్వినీ దత్.
అయితే తాజాగా ఈయన (Ashwini Dutt) ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ లో అత్యంత డిజాస్టర్ గా నిలిచిన సినిమా గురించి పలు విషయాలు వెల్లడించారు.తాను మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా శక్తి సినిమా చేసామని తెలిపారు అయితే ఈ సినిమా ఫలితాన్ని తాను ఊహించలేదని తెలిపారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ మొదటి రోజే డిజాస్టర్ కావడంతో పెద్ద ఎత్తున తనకు నష్టాలు వచ్చాయని తెలిపారు.
ఆ రోజుల్లో పంపిణీ మొత్తం నిర్మాతలు చూసుకునేవారు నష్టాలు వచ్చినా లాభాలు వచ్చిన వారే భరించాల్సిందే నష్టాలు వస్తే ఇల్లు పొలాలు, భూములు అమ్ముకొని వెళ్లిపోయేవారు.ఇలా తాను కూడా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అశ్వినీ దత్ పేర్కొన్నారు. శక్తి సినిమా కోసం తాను అప్పట్లోనే 40 నుంచి 45 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టామని తెలిపారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత భారీ స్థాయిలో కలెక్షన్లు పడిపోయాయి అయితే ఈ సినిమా వల్ల తనకు ఏకంగా 32 కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయని అశ్విని దత్ పేర్కొన్నారు.
అయితే ఆ సమయంలో ఇక సినిమాలు మానేసి ఇండస్ట్రీకి దూరం కావాలని అనుకున్నాను అందుకే నాలుగైదు సంవత్సరాలు పాటు తను ఎలాంటి సినిమాలు చేయలేదని ఈయన తెలియజేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?