Bandla Ganesh: మీడియా ముఖంగా త్రివిక్రమ్ కి బండ్ల గణేష్ అపాలజీ .!

ఇండస్ట్రీ మొత్తం ‘గురూజీ” అని ఎంతో మర్యాదగా పిలుచుకొనే త్రివిక్రమ్ శ్రీమినాస్ (Trivikram)  కు ఇండస్ట్రీ బయట కూడా విశేషమైన గౌరవం ఉంది. ఆయన సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా.. పుస్తకాలు, భాష పరిజ్ఞానం, పురాణాలపై ఆయనకున్న పట్టు గురించి అందరూ ఒకటికి పదిసార్లు మాట్లాడుకుంటారు. అటువంటి త్రివిక్రమ్ ను పచ్చిబూతులు తిట్టాడు బండ్ల గణేష్ (Bandla Ganesh) . పవన్ కల్యాణ్ నటించిన “బ్రో” (BRO) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు నువ్వొస్తున్నావా బండ్లన్న అని కాల్ చేసిన ఓ అభిమానికి సమాధానం చెబుతూ, బండ్ల గణేష్ కాస్త పరుషమైన పదజాలంతో రెచ్చిపోయాడు.

Bandla Ganesh

ఆ ఆడియో కాల్ భీభత్సంగా వైరల్ అయ్యింది. ఆ తర్వాత కూడా బండ్ల కొన్ని ట్వీట్స్ లో త్రివిక్రమ్ ను టార్గెట్ చేయడం జరిగింది. మరి ఇన్నాళ్ల తర్వాత ఏమైందో ఏమో కానీ.. ఎవరు ప్రశ్నించకుండానే బండ్ల స్వయంగా కలగజేసుకొని “ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు చెబుతూ.. క్షమాపణలు కోరుతున్నాను. అసలు నేను “గబ్బర్ సింగ్”  (Gabbar Singh)  ప్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారకుల్లో త్రివిక్రమ్ ఒకరు, ఆయన్ని ఆరోజు ఏదో మూడ్ లో ఉంది తప్పుగా మాట్లాడాను” అని వివరణ ఇచ్చారు.

అదే సందర్భంలో ఆ ఆడియో కాల్ వైరల్ అయిన తర్వాత కూడా త్రివిక్రమ్ తో మాట్లాడాను అని ఆయన పేర్కొనడం విశేషం. ఇకపోతే.. బండ్ల గణేష్ ఇలా మీడియా ముఖంగా, లైవ్ లో త్రివిక్రమ్ కి సారీ చెప్పడం అనేది మరోసారి త్రివిక్రమ్ స్థాయిని అందరికీ పరిచయం చేసింది.

అదే సందర్భంలో.. బండ్ల గణేష్ మాట్లాడుతూ నిర్మాతగా మరిన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తానని, కుదిరితే హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో కూడా సినిమా చేస్తానని బండ్ల గణేష్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. మరి నిజంగానే బండ్ల గణేష్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ప్రొడ్యూసర్ గా బిజీ అవుతాడా లేదా అనేది చూడాలి.

చూసుకోవాలి కదయ్యా బండ్ల గణేషు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus