Bandla Ganesh: బండ్ల చెప్పినట్టే పవన్ ఏపీకి సీఎం అవుతారా?

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవన్ ను ఏ స్థాయిలో అభిమానిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెంట్లలో, ఇంటర్వ్యూలలో బండ్ల గణేష్ పవన్ గురించి ఏం మాట్లాడినా ఆ స్పీచ్, ఆ కామెంట్లు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. పవన్ అభిమానులు సైతం చాలా సందర్భాల్లో బండ్ల గణేష్ పై అభిమానాన్ని చాటుకుంటారు. పవన్ బండ్ల గణేష్ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే తాజాగా ఒక నెటిజన్ పవన్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కితే బాగుంటుందని కామెంట్ చేశారు. ఈ కాంబినేషన్ లో సినిమా కోసం ఎదురుచూస్తున్నామని ఫ్యాన్ కామెంట్ చేశారు. ఆ కామెంట్ కు పవన్ తో సినిమా లేదు బ్రదర్ బాస్ ఈజ్ నెక్స్ట్ సీఎం అని ఆయన చెప్పుకొచ్చారు. బండ్ల గణేష్ చేసిన కామెంట్ క్ రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తుండటం గమనార్హం. పవన్ సీఎం అవుతారని బండ్ల గణేష్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

బండ్ల గణేష్ చెప్పినట్టే పవన్ ఏపీకి సీఎం అవుతారని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. మరోవైపు పవన్ పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా? లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. జనసేన పార్టీ సొంతంగా పోటీ చేస్తే ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే ప్రశ్నకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ కచ్చితంగా సీఎం కావాలని పవన్ సీఎం అయితే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలలో నటిస్తుండగా ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుందో ఏ సినిమా ఆలస్యంగా రిలీజ్ అవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కు రోజురోజుకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus