Bunny Vasu: మొత్తానికి బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చేశాడు!

ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాల హవా కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పాలి. మరీ ముఖ్యంగా మలయాళంలో హిట్టైన చిత్రాలను రీమేక్ చేసే పనిలో ఎక్కువగా పడ్డారు మన మేకర్స్. ‘భీమ్లా నాయక్’ ‘గాడ్ ఫాదర్’ ‘బుట్టబొమ్మ’.. ఇవన్నీ మలయాళంలో హిట్ అయిన సినిమాల రీమేక్ లే..! ఇదే కోవలో మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని రీమేక్ చేసే పనిలో పడింది ‘జిఎ2 పిక్చర్స్’ సంస్థ. అదే ‘నాయట్టు’ రీమేక్.

2021 ఏప్రిల్ లో విడుదలై సూపర్ హిట్ ‘నాయ‌ట్టు’ ని తెలుగులో రీమేక్ చేయడానికి అల్లు అరవింద్, బన్నీ వాస్ రెడీ అయ్యారు. ఇందుకు ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ ను ఎంపిక చేసుకున్నారు. రావు రమేష్ ఈ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికయ్యాడు. అంజలి కూడా ఓ ముఖ్య పాత్రకు ఎంపికైనట్టు కథనాలు వినిపించాయి. అయితే బడ్జెట్ సమస్యల వల్ల ఈ రీమేక్ ను అల్లు అరవింద్, బన్నీ వాస్ ఆపేసినట్టు వినికిడి.

ఒరిజినల్ ను కేవలం రూ.4 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు.. తెలుగులో కూడా అంతే బడ్జెట్ అనుకున్నారు. కానీ డబుల్ అవ్వడంతో.. ఈ రీమేక్ ను పక్కన పెట్టినట్లు కథనాలు వినిపించాయి. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. దీంతో జనాలు కూడా ఈ రీమేక్ గురించి మర్చిపోయారు. అయితే తాజాగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ప్రమోషన్లలో బన్నీ వాస్ ‘నాయట్టు’ రీమేక్ పనులు జరుగుతున్నాయి అని చెప్పారు. త్వరలోనే ఈ మూవీని కంప్లీట్ చేయాలని డిసైడ్ అయినట్టు కూడా చెప్పుకొచ్చారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus