రవితేజ కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో తెరకెక్కిన ఈగల్ మూవీకి 260 థియేటర్లు ఉన్నా ఇతర సినిమాలకు మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో ఈ సినిమా మేకర్స్ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి నెల 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఒకరోజు ముందు యాత్ర2 రిలీజ్ కానుండగా ఫిబ్రవరి 9వ తేదీన ఊరు పేరు భైరవ కోన సినిమా రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.
ఈగల్ థియేటర్స్ నా సామిరంగ సినిమాకు మాత్రమే కేటాయిస్తారా అనే ప్రశ్న అలా ఏం లేదని సంక్రాంతికి రిలీజ్ కానున్న అన్ని సినిమాలకు ఇస్తామని టీజీ విశ్వప్రసాద్ వెల్లడించారు. రవితేజ గారికి పరిస్థితులను వివరించి ఒప్పించామని టీజీ విశ్వప్రసాద్ అన్నారు. యాత్ర2 మూవీ జానర్ వేరని ఈగల్ జానర్ వేరని ఆయన కామెంట్లు చేశారు. రవితేజ గారికి హ్యూజ్ ఫాలోయింగ్ ఉందని అందరు హీరోల ఫ్యాన్స్ రవితేజను అభిమానిస్తారని విశ్వప్రసాద్ వెల్లడించారు.
సంక్రాంతి పండుగకు 3 సినిమాలకు స్పేస్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రవితేజ గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా భిన్నమైన మూవీ సినిమా ఎవరినీ నిరుత్సాహపరచదని విశ్వప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభాస్ మారుతి సినిమా అప్ డేట్ జనవరి 15వ తేదీన వస్తుందని ఆయన వెల్లడించారు. రవితేజ గారితో మరో ప్రాజెక్ట్ చేస్తున్నామని పోస్ట్ సమ్మర్ లో రిలీజ్ అవుతుందని విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు.
శర్వానంద్, శ్రీవిష్ణులతో సినిమాలు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాది 12 సినిమాలకు అటూఇటుగా రిలీజ్ చేస్తామని విశ్వ ప్రసాద్ చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో ఓటీటీ కోసం కొన్ని సినిమాలు చేశామని ఆయన కామెంట్లు చేశారు. రవితేజకు ఈగల్ సినిమాతో (Eagle) బిగ్గెస్ట్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అనుపమ, కావ్య థాపర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!