టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఇంట్లో.. నాలుగు రోజుల నుండి ఐటీ రైడ్స్ జరుగుతున్నా సంగతి తెలిసిందే. గత రెండేళ్లలో దిల్ రాజు నిర్మించిన సినిమాలు.. వాటికి అయిన బడ్జెట్లు, కలెక్షన్స్ వంటి వాటి గురించి ప్రతి చిన్న డీటెయిల్స్ ను ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. దిల్ రాజు ఇంట్లోనే కాదు అతని కూతురు హన్షిత రెడ్డి, సోదరులు శిరీష్ (Shirish) – లక్ష్మణ్..ల ఇళ్లల్లో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.
ఈ రైడ్స్ తో దిల్ రాజు తల్లి ఆందోళనకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. అవును నిర్మాత దిల్ రాజు తల్లి అనారోగ్యం పాలయ్యారు. ఆమె అస్వస్థతకు గురవ్వడంతో హాస్పిటల్ కు తరలించారు. ఐటీ అధికారుల వ్యాన్లోనే ఆమెను హాస్పిటల్ కు తరలించడం గమనార్హం. ఆమె కూడా కుటుంబ సభ్యులతో పాటు ఐటీ శాఖకు చెందిన ఓ మహిళా అధికారి కూడా వెళ్లడం జరిగింది. దిల్ రాజు తల్లి ఆరోగ్యం పరిస్థితి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక దిల్ రాజు నిర్మాణంలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందింది. అది ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరోపక్క ఆయన నిర్మాణంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా కూడా ఇదే సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. వీటిలో ‘గేమ్ ఛేంజర్’ ప్లాప్ అవ్వగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.