డివివి దానయ్య నిర్మాణంలో రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా నటించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈ సినిమాలోని నాటునాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వచ్చింది. అయితే ఈ పాట ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంతో ప్రతి ఒక్కరు ఈ విషయంపై స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇలా ఈ సినిమా ఇంత గొప్ప అవార్డును అందుకున్నప్పటికీ నిర్మాత దానయ్య మాత్రం ఈ అవార్డు విషయంపై స్పందించకపోవడమే కాకుండా ఈ సినిమా వేడుకలకు కూడా దూరంగా ఉన్నారు. అయితే ఈయన దూరంగా ఉండడానికి కారణాలు ఏంటి అని కూడా ఆరా తీశారు.అయితే తాజాగా దానయ్య ఈ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ రావడం పై స్పందించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దానయ్య మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటిసారి ఒక పాటకు ఆస్కార్ రావడం నిజంగా గర్వించదగ్గ విషయం అని తెలిపారు.
తాను రాజమౌళి గారితో సినిమా చేయాలని 2006లో అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేద్దామని చెప్పడంతో ఆయన మర్యాద రామన్న సినిమా చేశారు. కానీ తను పెద్ద సినిమా చేయాలని చెప్పాను. ఆ సమయంలోనే తాను రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని అవి పూర్తి కాగానే చేద్దామని చెప్పి ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో ఈ సినిమా చేశారని తెలిపారు. ఇక ఈ సినిమా చేసే సమయంలో ఎన్నో కష్టాలను పడ్డాము. కరోనా కారణంగా అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అయింది..
ఇక నాటు నాటు పాటను 30 రోజులు రిహార్సిల్స్ చేసి 17 రోజుల పాటు ఉక్రెయిన్ లో షూట్ చేశామని ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది అంటూ ఈయన సంతోషం వ్యక్తం చేశారు.ఇక ఈ అవార్డు క్రెడిట్ మొత్తం రాజమౌళి గారికి చెందుతుందని ఆయన పడిన కష్టానికి ఆస్కార్ ప్రతిఫలం అని తెలిపారు. అయితే ఈ అవార్డు వచ్చిన వెంటనే రాజమౌళితో మాట్లాడదామని ప్రయత్నించాను ఆయన అక్కడ వేడుకలలో బిజీగా ఉండటం వల్ల తాను మాట్లాడలేకపోయానని ఈ సందర్భంగా దానయ్య తెలిపారు.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్