Simbu: హీరోకు కోటి రూపాయలు కారును బహుమతిగా ఇచ్చిన నిర్మాత!

ఈ మధ్యకాలంలో నిర్మాతలు దర్శకులకు డైరెక్టర్లకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఒక సినిమా ఊహించని దానికన్నా ఎంతో మంచి విజయం అందుకుంటే అందుకు ప్రతిఫలంగా నిర్మాతలు దర్శకులకు హీరోలకు ఎంతో ఖరీదైన కానుకలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీలో విక్రమ్ సినిమా ఎంతో మంచి విజయం కావడంతో హీరో కమల్ హాసన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజుకి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మరొక కోలీవుడ్ హీరో శింబు కూడా నిర్మాత నుంచి ఇలాంటి ఖరీదైన కారును బహుమానంగా అందుకున్నారు. శింబు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వెందు తానిందాతు కాడు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగులో ది లైఫ్ ఆఫ్ ముత్తు అనే పేరుతో విడుదలైంది. ఇక మానాడు సినిమా తరువాత శింబు ఇలాంటి హిట్ అందుకోవడంతో నిర్మాతకు భారీగా లాభాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఇషారీ కే గణేష్ హీరో శింబుకి ఏకంగా కోటి రూపాయలు విలువ చేసే టోయోటో న్యూ వెల్ వైర్ కారణం బహుమానంగా అందజేశారు.ఈ క్రమంలోనే ఈ కారు తాళాలను హీరోకి అందిస్తూ దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు. ఇక హీరోకి మాత్రమే కాకుండా దర్శకుడు గౌతమ్ మీనన్ కి ఖరీదైన బైకును బహుమానంగా ఇచ్చారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus