చిరంజీవి (Chiranjeevi) – శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి కొన్ని వార్తలు తెగ వినిపించాయి. ఆ సినిమా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అంటూ ఏవో పోస్టర్‌ను చూసి అంచనాలు వేసేస్తున్నారు నెటిజన్లు. ఫ్యాన్స్ అయితే మాత్రం ఒక వార్త విషయం తెగ టెన్షన్ పడ్డారు. తాజాగా దాని గురించి సినిమా నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ చెరుకూరి క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
ఫ్యాన్ బాయ్స్ సినిమా అంటూ ఇటీవల చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల – నాని (Nani) సినిమా అనౌన్స్ చేశారు. చిరంజీవి 156వ సినిమాగా తెరకెక్కుతుంది అని కూడా అనౌన్స్ చేశారు. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మాతగా రూపొందనున్న ఈ సినిమాకు నాని సమర్పకుడు అనే విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉండబోతోంది అని, అందుకే పోస్టర్‌ను మొత్తం బ్లడ్ కలర్‌ను రూపొందించారు అని వార్తలొచ్చాయి.
అక్కడితో ఆగకుండా ఈ సినిమాను ప్రయోగాత్మకంగా సిద్ధం చేస్తున్నారని.. పాటలు ఉండవు అనే పుకారు కూడా పుట్టించారు. అంతేకాదు హీరోయిన్ కూడా ఉండదు అని చెప్పేశారు. ఈ మాటలు విన్నాక ఫ్యాన్స్‌కు ‘గాడ్ ఫాదర్’ (Godfather) సినిమా గుర్తొచ్చింది. బాబోయ్ అలాంటి కాన్సెప్ట్ వద్దంటే వద్దు అనే కామెంట్లు వినిపించాయి. అయితే నిర్మాత సుధాకర్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి 156 సినిమాపై వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పేశారు.
ఇప్పటివరకు సినిమాకు సంబంధించి సినిమాటోగ్రఫర్, మ్యూజిక్ డైరెక్టర్‌ను మాత్రమే ఫిక్స్ చేశామని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా పీరియాడిక్ జోనర్‌లో ఉంటుందని, ఇందులో వైలెంట్‌గా కనిపిస్తాడని చెప్పకనే చెప్పారాయన. మరోవైపు, త్వరలో చిరంజీవి ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే అది ఎప్పుడు అనేది ఇంకా టీమ్ అనౌన్స్ చేయడం లేదు. సినిమా టీజర్‌కు వచ్చిన స్పందన చూశాక విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రీ థింక్ చేస్తున్నారని టాక్.