Naga Vamsi: అది చిన్న సినిమాగా తీద్దాం అనుకున్నాను..కానీ డబుల్ బడ్జెట్ అయ్యింది: నాగ వంశీ

  • October 3, 2022 / 11:31 AM IST

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగ వంశీ వరుసగా సినిమాలు నిర్మిస్తూ..బిజీగా గడుపుతున్నారు. ఆయన నిర్మాణంలో ‘స్వాతి ముత్యం’ అనే చిత్రం రూపొందింది. అక్టోబర్ 5 న ఈ మూవీ దసరా కానుకగా రిలీజ్ కానుంది.ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.ఈ ఏడాది నాగ వంశీ నిర్మాణంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘డిజె టిల్లు’ గురించి ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశాడు.

‘డిజె టిల్లు’ చిత్రాన్ని తాను రూ.4 కోట్ల బడ్జెట్ లో తీయాలనుకున్నాను అని. అయితే కోవిడ్ వల్ల దాని బడ్జెట్ పెరిగిపోయి రూ.9 కోట్లు అయ్యిందని..! చిన్న సినిమాగా దాన్ని తీద్దామనుకుంటే.. నాకు డబుల్ బడ్జెట్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా బడ్జెట్ పెరిగిపోవడం అనేది మేకింగ్ ఫెయిల్యూర్ అనలేము అని.. ఆ పరిస్థితులు అలా ఉన్నాయి అని నాగవంశీ తెలిపాడు. అలాగే ‘వరుడు కావలెను’ సినిమా కూడా చాలా ఇష్టపడి తీశామని,

అది రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం వలన అది కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది అని, కానీ ఆ సినిమా చూసిన చాలా మంది ఫోన్లు చేసి ‘మంచి సినిమా తీశారు.. మాకు బాగా నచ్చింది’ అని చెప్పారని, అయితే బాక్సాఫీస్ రిజల్ట్ వల్ల ఆ సినిమా చిన్నది అయిపోయినట్టు ఆయన చెప్పుకొచ్చాడు. ఆ రెండు సినిమాలు తనకు మంచి పాఠాలు నేర్పాయని..

తదుపరి చిత్రాలకు అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని కూడా ఈ సందర్భంగా నాగవంశీ చెప్పుకొచ్చారు. అలాగే ‘స్వాతి ముత్యం’ సినిమాలో ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్ ను టచ్ చేశామని.. అది పైకి చెప్పుకుంటే బాగోదు కానీ సినిమాలో చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని నాగవంశీ తెలిపాడు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus