మార్చి 28 డేట్ కి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ తో (Hari Hara Veera Mallu) పాటు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda ) ‘#VD12’ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సారీ సారీ.. ముందుగా మార్చి 28 కి అనౌన్స్ చేసింది ‘#VD12’ అనే చెప్పాలి. కానీ ఎందుకో అదే డేట్ కి ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా’ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ అనౌన్స్ చేశారు. దీంతో అప్పటికే ‘విజయ్ దేవరకొండ సినిమా ఆ డేట్ కి రాదేమో’ అనే సందేహం ప్రేక్షకులకి వచ్చింది.
అలా అని ‘హరిహర వీరమల్లు’ కూడా ఆ డేట్ కి వస్తుంది అనే నమ్మకం పవన్ అభిమానులకి కూడా లేదు. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ పార్ట్ చాలా పెండింగ్లో పడింది. కాబట్టి ఆ సినిమా వచ్చే అవకాశాలు లేవు. తాజాగా రిలీజ్ అయిన ‘మాట వినాలి’ పాట రిలీజ్ చేసినా మార్చి 28 డేట్ ని పీఆర్..లు కన్ఫర్మ్ చేయలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మరోపక్క ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీకి ఒక అలవాటు ఉంది.
అతనికి నచ్చిన డేట్స్ ని లాక్ చేయడానికి.. తన బ్యానర్లో రూపొందే ఏదో ఒక సినిమా ఆ డేట్ కి వస్తున్నట్టు ప్రకటిస్తాడు.గతేడాది కూడా మనం చూసుకుంటే.. సెప్టెంబర్ 27 కి ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) వస్తుంది అని ప్రకటించి ఆ డేట్ ని లాక్ చేశాడు. అప్పుడు ఆ డేట్ కి తాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ‘దేవర’ (Devara) రిలీజ్ అయ్యేలా చేశాడు. ఈసారి కూడా ‘VD 12’ పేరు చెప్పి మార్చి 28 ని లాక్ చేశాడు. కానీ ఆ డేట్ కి విజయ్ దేవరకొండ సినిమా వచ్చే అవకాశం లేదు అని తెలుస్తుంది.
అందుకే తన బ్యానర్లో రూపొందుతున్న మరో సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’ ని రంగంలోకి దింపుతున్నాడు. కాకపోతే నితిన్ ‘రాబిన్ హుడ్’ (Robinhood) కోసం ఒకరోజు వెనక్కి వెళ్లి మార్చి 29 కి ‘మ్యాడ్ స్క్వేర్’ ని రంగంలోకి దింపుతున్నాడు. నితిన్ (Nithiin).. నాగ వంశీ (Suryadevara Naga Vamsi) మంచి స్నేహితులు కాబట్టి.. ‘మ్యాడ్ స్క్వేర్’ ని ఒకరోజు వెనక్కి జరిపినట్టు స్పష్టమవుతుంది. సో ‘మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టే..!