Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి సినిమాపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ !

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ (Agent Sai Srinivasa Athreya) ‘జాతి రత్నాలు'(Jathi Ratnalu)  ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) వంటి సూపర్ హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) . ప్రస్తుతం అతను ఏ సినిమా చేస్తున్నాడు అనే విషయంపై చాలా మందికి ఒక క్లారిటీ అంటూ లేదు. ఇది పక్కన పెట్టేస్తే.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కంటే ముందుగా అతను ‘అనగనగా ఒక రాజు’ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు. ‘మ్యాడ్’ (MAD) ఫేమ్ కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయాల్సిన మూవీ ఇది.

Naveen Polishetty

‘మ్యాడ్’ కంటే ముందే మొదలైంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాలి. తమన్ సంగీత దర్శకుడు. ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఊహించని విధంగా ఈ సినిమాను పక్కన పెట్టాడు హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty). దీంతో ఇక ‘అనగనగా ఒక రాజు’ చిత్రం అటకెక్కినట్లే అని అంతా అనుకున్నారు. అయితే ఇందులో నిజం లేదని నవీన్ పోలిశెట్టి ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ‘మ్యాడ్’ హిట్ అయ్యాక పట్టాలెక్కుతోంది అనుకుంటే అది కూడా జరగలేదు.

దీంతో ఇక ఆ సినిమాని అంతా మర్చిపోయారు. అయితే ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు గురించి నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) క్లారిటీ ఇచ్చాడు. జనవరి నుండి ‘అనగనగా ఒక రాజు’ పట్టాలెక్కబోతుందట. అయితే కళ్యాణ్ శంకర్ దర్శకుడు కాదు. ఇంకో కొత్త కుర్రాడిని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. కళ్యాణ్ శంకర్ స్క్రిప్ట్ నవీన్ కి నచ్చకపోవడం వల్లే.. ఇప్పటివరకు డిలే అయినట్టు స్పష్టమవుతుంది. మరోపక్క ‘గంజా శంకర్’ సినిమా ఆగిపోయింది అనే క్లారిటీ కూడా నాగవంశీ ఇచ్చేశాడు.

బిష్ణోయ్ వర్గానికి సల్మాన్ ఏం ఆఫర్ చేశాడు..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus