Ram Talluri: పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబో మూవీకి సమస్య ఇదేనా?

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ప్రజల్లో పెరుగుతున్న క్రేజ్ అంతాఇంతా కాదు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో రాజకీయాలకు పరిమితమయ్యారు. పవన్ సురేందర్ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే పవన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయడానికే చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబో మూవీ ఎప్పుడు మొదలవుతుందనే చర్చ జరుగుతోంది.

మరోవైపు ఏజెంట్ (Agent) మూవీ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం కూడా సురేందర్ రెడ్డి కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. పవన్ సురేందర్ రెడ్డి కాంబో మూవీ గురించి నిర్మాత రామ్ తాళ్లూరి (Ram Talluri) క్లారిటీ ఇచ్చారు. మెకానిక్ రాకీ (Mechanic Rocky) గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా పవన్ సినిమా గురించి అప్ డేట్ ఇవ్వాలని ఒక జర్నలిస్ట్ అడగగా ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం ఏం జరుగుతుందో మీక్కూడా తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు. మా సైడ్ వర్క్ పూర్తైందని స్క్రిప్ట్ లాక్ చేశామని రామ్ తాళ్లూరి అన్నారు. పూజా కార్యక్రమం కూడా జరిగిందని ఇక పవన్ కళ్యాణ్ చేతుల్లోనే అంతా ఉందని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ను కలిశానని పవన్ కళ్యాణ్ వీలు చూసుకుని సినిమాలు చేయవచ్చని రామ్ తాళ్లూరి చెప్పుకొచ్చారు.

సురేందర్ రెడ్డి పవన్ సినిమా మొదలయ్యే సమయానికి మరో ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహిస్తారేమో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ కావడంతో ఆయన సినిమా షెడ్యూల్స్ కు సంబంధించి ఒకింత గందరగోళం కొనసాగుతోందని చెప్పవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus