Producer Ravindar: మహాలక్ష్మి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రవీందర్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో రవిందర్ చంద్రశేఖరన్ ఒకరు. ఈయన కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ఈయన నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్న సమయంలో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఈయన అధిక శరీర కాయంతో ఉండటం మహాలక్ష్మి కుందనపు బొమ్మల ఉండటంతో వీరి జోడి గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. మహాలక్ష్మి ఈయనను పెళ్లి చేసుకుంది అంటే ప్రేమతో కాదని కేవలం ఆయన డబ్బు చూసి ఈమె పెళ్లి చేసుకుంది అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఈ జంట మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తూ తమ మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని తెలియజేస్తూ వచ్చారు.

అయితే గత కొద్దిరోజుల క్రితం చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తి రవీందర్ పై నేరాలను మోపుతూ మోసం చేసి 16 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపణలు చేస్తూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా రవీందర్ ని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇలా ఇన్ని రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి రవీందర్ బెయిల్ పై బయటకు వచ్చారు. ఇలా బయటకు వచ్చినటువంటి ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా తాను ఎవరిని ఎలాంటి మోసం చేయలేదని ఆ వ్యక్తి మోసాలు నేరాలు నాకు తెలియడంతో నాపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ జైలుకు పంపించారని త్వరలోనే నిజా నిజాలు బయట పెడతానని అతడిని అసలు వదలను అంటూ కామెంట్ చేశారు. తన భార్య గురించి కూడా ఎన్నో రకాల ట్రోల్స్ వచ్చాయి ఈయన జైలులో ఉన్నప్పుడు ఆమె సోషల్ మీడియాలో ఎంతో సంతోషంగా యాక్టివ్ గా కనిపించడంతో చాలామంది విమర్శలు చేశారు.

ఈ విమర్శలు గురించి కూడా ఈయన (Ravindar) మాట్లాడారు నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అమ్మ తర్వాత మహాలక్ష్మి అంటే అంతే ఇష్టమని మహాలక్ష్మి నాకు భార్యగా రావడం ఒక వరం అంటూ ఈయన ఆమెపై ప్రశంసలు కురిపించారు. మా గురించి ఎంతమంది ఎన్ని రకాల విమర్శలు చేసిన ఎవరూ కూడా మమ్మల్ని విడదీయలేరని నా నుంచి మహాలక్ష్మిని వేరు చేయలేరు అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus