ఇప్పట్లో ఓ సినిమాకి బిజినెస్ జరగడం చాలా కష్టంగా ఉంటుంది. బజ్ ఉన్న సినిమాలకే బిజినెస్ బాగా జరుగుతుంది. లేదు అంటే.. రిలీజ్ అయ్యే వరకు దానికి బిజినెస్ జరగడం కష్టంగానే ఉంటుంది. అయితే ఈ మధ్య ఓ నిర్మాత మాత్రం తాను చేసిన సినిమాలన్నిటికీ ఏదో ఒక రకంగా సేఫ్ అయిపోతున్నాడు. అతను మరెవరో కాదు రాజేష్ దండా (Rajesh Danda) . డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో హిట్ సినిమాలను రిలీజ్ చేసిన ఇతను.., ‘ఒక్క క్షణం’ (Okka Kshanam) సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు.
ఆ సినిమాకి అతను కో – ప్రొడ్యూసర్ గా పనిచేశాడు. అల్లరి నరేష్ తో (Allari Naresh) ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam) సినిమాతో పూర్తిస్థాయి నిర్మాతగా మారాడు. ఆ సినిమా ఆడలేదు. అయితే ఆ తర్వాత అనిల్ సుంకరతో కలిసి ‘సామజవరగమన’ (Samajavaragamana) అనే సినిమాని నిర్మించాడు. గత ఏడాది జూన్ 29న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. 4 రెట్లు లాభాలు అందించింది.
ఇక ఈ ఏడాది ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది కూడా పర్వాలేదు అనిపించింది. థియేట్రికల్ పరంగా కొద్దిపాటి నష్టాలు వచ్చినా.. ప్రీ రిలీజ్ బిజినెస్ తో అతను సేఫ్ అయ్యాడు. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ తో ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) అనే సినిమాని నిర్మిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవ్వగానే.. దీనికి థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. ఇక ఇప్పుడు సందీప్ కిషన్ (Sundeep Kishan) – త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) లతో మరో సినిమా నిర్మిస్తున్నాడు.
దీనికి కూడా నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో మంచి డీల్ రావడం.. అది కూడా ఫైనల్ అవ్వడం జరిగిపోయిందట. సో ఇప్పుడు టాలీవుడ్లో సినిమాల విషయంలో టెన్షన్ లేకుండా ఉన్నది ఈ నిర్మాతే అని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ అయితే కనుక ఇతను కూడా టాప్ ప్రొడ్యూసర్స్ లిస్టులో చేరిపోతాడన్న మాట.