Producer SKN: ఇంటర్వ్యూ : ‘ట్రూ లవర్’ మూవీ గురించి నిర్మాత ఎస్.కె.ఎన్ చెప్పిన ఆసక్తికర విషయాలు!

‘ప్రతి రోజు పండగే’, ‘టాక్సీవాలా’, ‘బేబి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో కల్ట్ ప్రొడ్యూసర్ గా పేరుతెచ్చుకున్నారు ఎస్.కె.ఎన్. ఆయన తన స్నేహితుడు, స్టార్ డైరెక్టర్ అయిన మారుతితో కలిసి మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన తమిళ మూవీ ‘లవర్’ ని ‘ట్రూ లవర్’ గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘మిలియన్ డాలర్ స్టూడియోస్’, ‘ఎంఆర్ పీ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ప్రభు రామ్ వ్యాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 10న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి నిర్మాత ఎస్.కె.ఎన్ చెప్పిన విశేషాలు మీకోసం :

ప్ర) ‘ట్రూ లవర్’ ఎలా ఉంటాడు?

ఎస్.కె.ఎన్ : చాలా హానెస్ట్ గా ఉంటాడు. అందరికీ నచ్చుతాడు.

ప్ర) ఛాంబర్ ‘ఈగల్’ సినిమాకి సోలో డేట్ కేటాయిస్తాము అని చెప్పింది. అయినా మీరు ‘ట్రూ లవర్’ తో వచ్చేస్తున్నారు.?

ఎస్.కె.ఎన్ : మాది చిన్న సినిమా. చిన్న సైజు రిలీజ్. ‘ఈగల్’ తో పోటీ పడే పెద్ద సినిమా కాదు. వాళ్ళని కలిసి చెప్పిన తర్వాతే 10 కి రావాలని డిసైడ్ అయ్యాం.

ప) ఛాంబర్ నిర్ణయానికి కట్టు పడలేదు అనే విమర్శలు ఎదురవుతాయి కదా?

ఎస్.కె.ఎన్ : అదే ఛాంబర్ రూల్ ప్రకారం అయితే ఏ సినిమా కూడా 5 వారాలు పూర్తయ్యేవరకు రిలీజ్ కాకూడదు. ఆ నిర్ణయానికి కట్టుబడి నా ‘బేబీ’ సినిమాని 8 వారాల వరకు ఓటీటీకి ఇవ్వలేదు. మరి ఇప్పుడు కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి 5 వారాలు పూర్తవకుండానే ఓటీటీ రిలీజ్ చేస్తున్నారుగా..! మరి వాళ్ళని ఏమనాలి?

ప్ర) ‘ఈగల్’ విషయంలో ఛాంబర్ ప్రామిస్ చేసింది కదా సోలో రిలీజ్ డేట్ ఇస్తామని..!

ఎస్.కె.ఎన్ : ఏడాదిలో 52 వారాలు ఉంటాయి. రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు బోలెడు 200 పైనే ఉంటాయి. ప్రతి వారం సోలో రిలీజ్ కష్టం. ఇలానే ఉంటాయి.

ప్ర) ‘ట్రూ లవర్’ అనేది డబ్బింగ్ సినిమా.. రిలీజ్ టైం దగ్గర పడుతుంది? టెన్షన్ లేదా?

ఎస్.కె.ఎన్ : రిలీజ్ కి ముందు ప్రీమియర్స్ వేయాలని అనుకుంటున్నాం. రెండు, మూడు రోజుల ముందు ప్రీమియర్స్ పడి పాజిటివ్ టాక్ వస్తే ఆ టెన్షన్ అంతా ఆడియన్స్ తీసేసి మాకు రిలీఫ్ అండ్ సక్సెస్ ఇస్తారు అనేది మా నమ్మకం.

ప్ర) ‘ట్రూ లవర్’ లో మీకు నచ్చిన పాయింట్ ఏంటి.. తెలుగు ప్రేక్షకులకు ఇది నచ్చుతుంది అని ఎలా ఫిక్స్ అయ్యారు?

ఎస్.కె.ఎన్ : ఇందులో ఎమోషన్స్ అన్నీ యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా. హీరోయిన్ ‘పబ్బులో ఉండి ఇంట్లో ఉన్నాను’ అని చెబుతుంది. అయితే ‘లొకేషన్’ పెట్టు అని హీరో చెబుతాడు. ఇలాంటి వాటికి యూత్ బాగా కనెక్ట్ అవుతారు అని నా అభిప్రాయం.

ప్ర) ‘బేబీ’ హిందీ రీమేక్ టైటిల్ ‘కల్ట్’ అనుకుంటున్నారట నిజమేనా?

ఎస్.కె.ఎన్ : నిజమే.. కానీ ఇంకా రిజిస్టర్ చేయించే వరకు చెప్పకూడదు అనుకున్నాను. సాయి రాజేష్ ‘బేబీ’ రీమేక్ ని డైరెక్ట్ చేస్తాడు.

ప్ర) ‘స్క్రిప్ట్ లేకుండా ‘బేబీ’ సినిమా తీశాం’ అని దర్శకుడు సాయి రాజేష్ ‘బేబీ’ ప్రమోషన్స్ లో చెప్పారు. రీమేక్ విషయంలో కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారా?

ఎస్.కె.ఎన్ : లేదు ‘బేబీ’ కి స్క్రిప్ట్ ఉంది. కానీ సాయి రాజేష్ ఎక్కువ ఫుటేజ్ తీసేశాడు. ‘లెంగ్త్ కంటే కంటెంట్ లో ఉన్న స్ట్రెంత్’ ముఖ్యమని కట్ చేశాం.(నవ్వుతూ)

ప్ర) హిందీలో అల్లు అర్జున్ గారికి భీభత్సమైన క్రేజ్ ఉంది. ఆయనతో ‘బేబీ’ రీమేక్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారా?

ఎస్.కె.ఎన్ : అల్లు అరవింద్ గారు మా ప్రాజెక్ట్ కి అసోసియేట్ అయితే బన్నీ గారు కూడా అసోసియేట్ అయినట్టే..!(నవ్వుతూ) అప్పుడు ఆయన రేంజ్ సాయం ఆయన కూడా చేస్తారు.

ప్ర) ఈ వీకెండ్ కి ప్రేక్షకుల ఫస్ట్ ఆప్షన్ ‘ఈగల్’ ఉంటుంది? మీ సినిమాకి ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారా?

ఎస్.కె.ఎన్ : రాజా సాబ్ సినిమాను మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఆ టీమ్ లో నేనూ ఉన్నాను. ఆ సంస్థ మా ఫ్రెండ్లీ బ్యానర్ లాంటిదే. చిన్నా, పెద్దా అన్ని సినిమాలు బాగుండాలి. ‘ఈగల్’ లానే అన్ని సినిమాలు మంచి సక్సెస్ కావాలి. అప్పుడే ఎక్కువమంది టెక్నీషియన్స్ కు పని దొరుకుతుంది.

ప్ర) ఫిబ్రవరి అనేది అన్ సీజన్ అంటారు. రీసెంట్ గా వచ్చిన ‘అంబాజీపేట..’ బేబీ రేంజ్లో కలెక్ట్ చేయట్లేదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ రకంగా ‘ట్రూ లవర్’ గురించి ఏమనుకుంటున్నారు?

ఎస్.కె.ఎన్ : ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’…ఒక్కో సినిమాకు ఒక్కో రేంజ్ ఉంటుంది. కానీ రెండు సూపర్ హిట్ సినిమాలే. సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. మార్చి వరకు మంచి రన్ ఉంటుందని ఆశిస్తున్నాం.

ప్ర) ఎక్కువగా యూత్ ఫుల్ మూవీస్ చేయడానికి కారణం?

ఎస్.కె.ఎన్ : నాకు (Producer SKN) సహజంగా లవ్ స్టోరీస్, యూత్ ఫుల్ మూవీస్ అంటే ఇష్టం. నేను మారుతి గారితో కలిసి చేసిన ‘ఈ రోజుల్లో’ కూడా యూత్ ఫుల్ మూవీ. పెద్ద స్టార్స్ తో సినిమాలు చేస్తే దాని బడ్జెట్ ఎక్కువ కాబట్టి మేకింగ్ కు మేము ప్రిపేర్ కావాలి. కొత్త వాళ్లతో మూవీ చేసినప్పుడు కంటెంట్ యూత్ ఫుల్ గా ఉంటే ఆ సినిమాల రీచ్ బాగుంటుంది. నెక్స్ట్ నేను చేస్తున్న 4 సినిమాల్లో 3 యూత్ ఫుల్ మూవీస్ ఉంటాయి. ఒకటి సైన్స్ ఫిక్షన్ తో ఔటాఫ్ ది బాక్స్ గా ఉంటుంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus