Suniel Narang: నాగార్జున తప్ప ఎవ్వరూ ఆ పాత్రకి న్యాయం చేయలేరా.. నిర్మాత కామెంట్స్ వైరల్!

దర్శకులు కొన్ని పాత్రలు ఒకరిని దృష్టిలో పెట్టుకుని రాస్తే…. ఆ నటులకే అవి నచ్చుతాయి, వాళ్ళ వద్దకే అవి వెళ్తాయి అని కచ్చితంగా చెప్పలేం. అవి చేరాల్సిన వాళ్ళకే వెళ్తాయి. దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ‘అతడు’ (Athadu) లో నాజర్ (Nassar) పాత్రకు శోభన్ బాబుని అనుకున్నారు. కానీ అది జరగలేదు. అలాగే ‘ఇడియట్’ (idiot) కథని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోసం రాసుకున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh). కానీ రవితేజ (Ravi Teja) వద్దకు వెళ్ళింది.

Suniel Narang

ఇలా చెప్పుకుంటూ పోతే హిట్ సినిమాల్లోనే కాదు.. ప్లాప్ సినిమాల్లో కూడా ఇలాంటి మార్పులు ఎన్నో చోటు చేసుకున్నాయి. ‘ఇండియన్ 2’ లో (Indian 2) సిద్దార్థ్ (Siddharth) పాత్ర కోసం, ‘థగ్ లైఫ్’ (Thug Life )  లో శింబు (Silambarasan)  పాత్ర కోసం దుల్కర్ సల్మాన్ ను అనుకున్నారు. కానీ అతను చేయలేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే… త్వరలో ‘కుబేర’ (Kubera) సినిమా వస్తుంది.

దీనికి శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకుడు. తమిళ స్టార్ ధనుష్ (Dhanush) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ నాగార్జున ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నాగ్ లుక్ కూడా కొత్తగా ఉంది. టీజర్ చూస్తే నాగార్జున (Nagarjuna) రోల్లో కూడా డెప్త్ ఉంటుంది అనే ఫీలింగ్ అందరికీ కలిగింది. అయితే ఈ పాత్రకి నాగార్జున ఫస్ట్ ఛాయిస్ కాదట.

ఈ పాత్ర కోసం ముందుగా వెంకటేష్ (Venkatesh Daggubati), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వంటి వారిని అనుకున్నారట. కానీ వాళ్ళు పాజిటివ్ గా రెస్పాండ్ కాకపోవడంతో నాగార్జునని సంప్రదించారట. పాత్ర విన్న వెంటనే నాగార్జున ఓకే చేశారట. నాగార్జున తప్ప ఈ పాత్రకి ఎవ్వరూ న్యాయం చేయలేరు అని నిర్మాత సునీల్ నారంగ్ (Suniel Narang) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

‘కన్నప్ప’ వివాదంపై స్పందించిన మంచు విష్ణు.. ఓటీటీ డీల్‌ గురించి కూడా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus