మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘ఈగల్’ మూవీ ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుంది. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు.’పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో నిర్మాత విశ్వప్రసాద్ చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం :
ప్ర) ముందుగా ఈ సినిమా విషయంలో మీకు లభించిన సోలో రిలీజ్ డేట్ ను బట్టి సంతృప్తిగా ఉన్నారా?
విశ్వప్రసాద్ : ఛాంబర్ కి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నందుకు సంతృప్తిగా ఉన్నాము. మేము జనవరి 13 కి వచ్చినా మాకు 250 నుండి 300 థియేటర్లు దొరుకుతాయి. అవి కూడా మాకు సరిపోతాయి.కానీ మిగతా సినిమాల పై ఒత్తిడి పెరగకూడదు అని భావించి ఫిబ్రవరి 9కి రావడం అనేది మాకు సంతోషాన్ని కలిగించింది.
ప్ర) పోటీగా ‘యాత్ర 2’ వంటి సినిమాలు కూడా వస్తున్నాయి కదా?
విశ్వప్రసాద్ : ‘యాత్ర 2’ జోనర్ వేరు. మా సినిమా జోనర్ వేరు. సో మాకు ఎక్కువ థియేటర్స్ లభిస్తున్నాయి కాబట్టి.. ఇబ్బంది కూడా లేదు.
ప్ర) ‘ధమాకా’ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత రవితేజ గారితో సినిమా అనుకున్నప్పుడు కొత్త డైరెక్టర్ కదా, రిస్క్ చేస్తున్నాం అనే ఆలోచన రాలేదా?
విశ్వప్రసాద్ : ‘ధమాకా’ మాస్ ఎంటర్ టైనర్.. ‘ఈగల్’ చాలా క్లాసిక్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో ఎంటర్ టైన్మెంట్ బేస్ మాస్ ఉంది. కంటెంట్ కచ్చితంగా బాగుంటుంది. ఆడియన్స్ ని అలరించే చాలా మంచి ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. రవితేజ గారు సరికొత్తగా కనిపించబోతున్నారు. కథ, మెసేజ్, యాక్షన్, సాంగ్స్ అన్నీ ఎక్స్ ట్రార్డినరీ వుంటాయి. కాకపోతే మేము చేస్తున్న రిస్క్ ఏంటి అంటే ఓటీటీ బిజినెస్ అవ్వకుండా రంగంలోకి దిగడం. అదొక్కటే మేము చేస్తున్న రిస్క్ అనుకోవాలి. కానీ థియేట్రికల్ రిజల్ట్ పై మాకు నమ్మకం ఉంది.
ప్ర) రవితేజ గారితోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం వెనుక కారణమేంటి?
విశ్వప్రసాద్ : ఆయనతో మాకు మంచి అనుబంధం ఉంది. అందువల్లే ఆయనతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాం.
ప్ర) డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
విశ్వప్రసాద్ : ‘నిన్ను కోరి’ నుండి అతను మాకు బాగా తెలుసు. ధమాకా జరుగుతున్న సమయంలోనే ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాం. ‘ఈగల్’ ని అద్భుతంగా తీశారు. మా నిర్మాణంలో అతనితో మరో సినిమా చేస్తున్నాం. త్వరలోనే అనౌన్స్మెంట్ ఇస్తాం.
ప్ర) ఫిబ్రవరి 9కి మారారు కదా.. థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగిందని అనుకుంటున్నారా?
విశ్వప్రసాద్ : కచ్చితంగా బెటర్ గా జరిగింది. అందులో డౌట్ లేదు.
ప్ర) రవితేజ గారు కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఆ భయం ఈగల్ విషయంలో మీకేమైనా ఉందా?
విశ్వప్రసాద్ : ‘ధమాకా’ సినిమాకి మీరు నెగిటివ్ గానే రివ్యూస్ ఇచ్చారు కదా(నవ్వుతూ) . కానీ మా నమ్మకం, ప్రేక్షకుల ఆదరణ సినిమాని నిలబెట్టాయి. ‘ఈగల్’ విషయంలో కూడా అదే నమ్మకంతో ఉన్నాం.
ప్ర) ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ నుంచి ఈ ఏడాది ఎన్ని సినిమాలు రావచ్చు ?
విశ్వప్రసాద్ : మినిమం 15 సినిమాలు విడుదలౌతాయి. ఇవి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ప్రొడక్షన్ లో దాదాపు 6 చిత్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఈటీవీ విన్ కోసం కొన్ని చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే దాదాపు 4 సినిమాలు అమెరికాలో చేస్తున్నాం. ప్రతి నెల మా నుండి ఒక చిత్రం విడుదల అవుతుంది. ఈ ఏడాది 50 చిత్రాల మైలు రాయిని కూడా చేరుకుంటాం.
ప్ర) ‘బ్రో’ సినిమా ఫలితం మీరు అనుకున్నట్టే వచ్చింది అనుకుంటున్నారా?
విశ్వప్రసాద్ : అది గొప్ప విజయం అందుకోలేదు. కానీ మేము (Vishwa Prasad) ఆ ప్రాజెక్టుతో సంతృప్తిగానే ఉన్నాం. వి.ఎఫ్.ఎక్స్ విషయంలో అక్కడక్కడా కొన్ని పొరపాట్లు జరిగాయి. ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే అది కూడా మంచి ఫలితాన్ని అందుకునేది.
ప్ర) ప్రభాస్ గారి ‘రాజాసాబ్’ 2025 సంక్రాంతికి వస్తుందా? ఆ టైంకి చాలా సినిమాలు లాక్ అవుతున్నాయి?
విశ్వప్రసాద్ : త్వరలో తెలియజేస్తాం.! సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ప్రభాస్ సినిమా అంటే మాకు స్పేస్ లేకుండా ఉంటుందా?(నవ్వుతూ)
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!