సినిమా ఇండస్ట్రీపై కరోనా ఎంతగా ప్రభావం చూపిందో తెలిసిందే. నిర్మాతలు భారీ నష్టాలను చవిచూశారు. థియేటర్ల వ్యవస్థ కూడా ఘోరంగా దెబ్బతింది. నిర్మాతలు కనీసం తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసుకుంటూ కొంతవరకు నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ థియేటర్ల యజమానులకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఫైనల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తీర్చుకోవడానికి అనుమతులు వచ్చాయి. డిసెంబర్ 4 నుండి థియేటర్లను నడిపించడానికి సన్నాహక చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ల సంగతేమో కానీ మల్టీప్లెక్స్ లైతే ఆ రోజున మొదలుక్నున్నాయి.
అయితే థియేటర్ యాజమాన్యానికి టాలీవుడ్ నిర్మాతలు కండీషన్లు పెడుతున్నారు. మల్టీప్లెక్స్ లలో రెవెన్యూ షేరింగ్ విషయంలో ఎప్పటినుండో వివాదం నడుస్తోంది. థియేటర్ యాజమాన్యం ఆదాయంలో ఎక్కువ వాటా తీసుకుంటున్నాయేది నిర్మాతల వాదన.ఈ క్రమంలో రెవెన్యూ షేరింగ్ మార్చాలని ఒక ప్రతిపాదన పెట్టారు నిర్మాతలు. ఇప్పటివరకు ఒక సినిమాకి మొదటివారంలో వచ్చే వసూళ్లలో నిర్మాతలకు 55 శాతం, మల్టీప్లెక్స్ లకు 45 శాతం ఆదాయం దక్కుతోంది. తరువాత మూడు వారాల్లో 45:55, 35:65 రేషియోలో థియేటర్లకు, నిర్మాతలకు ఆదాయం వస్తోంది.
ఇక నుండి మొదటివారంలో తమకు 60 శాతం వాటా ఇచ్చి మల్టీప్లెక్స్ లు 40 శాతం తీసుకోవాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ డిమాండ్ చేస్తోంది. తరువాతి రెండు వారాల్లో 50:50, 40:60 వాటా చొప్పున పంచుకుందామని ప్రతిపాదన పెట్టారు. ఈ షేరింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేలా ఉండాలని.. దీంతో పాటు వర్చువల్ ప్రింట్ ఖర్చులు, థియేటర్ ఆవరణలో పెట్టే పోస్టర్ల ఖర్చు, థియేటర్లలో వేసే ట్రైలర్లకు డబ్బు వసూలు చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. మరి వీటికి మల్టీప్లెక్స్ ల యాజమాన్యం ఎంతవరకు అంగీకరిస్తుందో చూడాలి!