Pushpa Movie: పుష్ప1 అక్కడ డిజాస్టర్ కావడానికి కారణాలివేనా?

పుష్ప ది రైజ్ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించిన సినిమాలలో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో పాటు బన్నీ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా నిలిచింది. అటు మాస్ ప్రేక్షకులకు ఇటు క్లాస్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప ది రైజ్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని బయ్యర్లకు కళ్లు చెదిరే లాభాలను అందించింది.

అయితే పుష్ప ది రైజ్ సినిమాను కొన్ని వారాల క్రితం రష్యాలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రష్యాలో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం భారీ రేంజ్ లో ఖర్చు చేశారు. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాతలు అధికారికంగా ఈ సినిమా కలెక్షన్లను వెల్లడించారు. పుష్ప ది రైజ్ మూవీ అక్కడ కేవలం కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది.

పుష్ప మేకర్స్ ఈ సినిమా కలెక్షన్లను వెల్లడించకుండా ఉండి ఉంటే బాగుండేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పుష్ప1 సినిమాకు రష్యాలో భారీ స్థాయిలోనే ప్రమోషన్స్ చేసినా నటీనటులు అక్కడి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవడం మైనస్ అయింది. ఈ రీజన్ వల్లే పుష్ప1 అక్కడ డిజాస్టర్ అయిందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పుష్ప ది రూల్ సినిమాను రష్యాలో రిలీజ్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ లో పుష్ప ది రూల్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది. సుకుమార్ శరవేగంగా ఈ సినిమా షూట్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు బన్నీ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ చేరాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus