Ghani Movie: ఆ నిర్మాతలు గని మూవీని రిజెక్ట్ చేశారా?

ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలను దర్శకులు ఎంత అద్భుతంగా తెరకెక్కించినా ఆ సినిమాలు ప్రేక్షకాదరణను సొంతం చేసుకోవడం లేదు. గని సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. వరుస విజయాలతో జోరుమీదున్న వరుణ్ తేజ్ కు గని సినిమా స్పీడ్ బ్రేకర్ అనే చెప్పాలి. ఈ సినిమా కోసం నిర్మాతలు సిద్ధు, అల్లు బాబీ వరుణ్ తేజ్ మార్కెట్ ను మించి ఖర్చు చేశారు.

ప్రముఖ ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా మేకర్స్ మాత్రం ఆ ఆఫర్లకు ఓకే చెప్పలేదు. దాదాపుగా 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. అయితే గని సినిమాను నిర్మించే ఆఫర్ వచ్చినా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వదులుకున్నారని సమాచారం అందుతోంది. వరుణ్ తేజ్ గని కథ వినమని మైత్రీ నిర్మాతలకు సూచించగా మైత్రీ అధినేతలు ఆ సినిమాను నిర్మించలేమని చెప్పారని సమాచారం.

ఆ తర్వాత ఈ సినిమాను నిర్మించే బాధ్యతలను సిద్ధు, అల్లు బాబీ తీసుకున్నారని సమాచారం. పాతిక కోట్ల రూపాయలకు గని నాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడవగా థియేటర్ల నుంచి ఈ సినిమాకు పాతిక కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తే ఈ సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం అసాధ్యమేనని చెప్పవచ్చు.

వచ్చే వారం కేజీఎఫ్2, బీస్ట్ సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో గని సినిమాకు ఫస్ట్ వీక్ కలెక్షన్లతోనే ఫైనల్ రన్ ముగిసే అవకాశాలు ఉంటాయి. అయితే గని సినిమా వరుణ్ తేజ్ కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపే ఛాన్స్ అయితే లేదని చెప్పవచ్చు. ఎఫ్3 సినిమాతో వరుణ్ తేజ్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus