‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ టికెట్ రేట్ల పెంపు గురించి నిర్మాతలు ఎవర్ని కలిశారంటే!..

ఈ సంక్రాంతి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా మరియు రసాభాసగా మారింది.. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, నటసింహ నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు ఈ పెద్ద పండక్కి పోటీపడడమే దీనికి ప్రధాన కారణం అనేది పక్కన పెడితే.. దళపతి విజయ్ ‘వారసుడు’, తల అజిత్ ‘తెగింపు’తో పాటు సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’ కూడా బరిలోకి దిగబోతున్నాయి..తన సినిమా ‘వారసుడు’ కోసం డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎక్కువ థియేటర్లు,

మిగతా సినిమాలకు తక్కువ థియేటర్లు కేటాయిస్తున్నారనే వార్తలతో గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. మైత్రీ మైవీస్ నిర్మాతలు ఇటీవలే సొంతగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ఓపెన్ చేయడం.. ఏపీ, తెలంగాణలో దిల్ రాజుకి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ రైట్స్ ఇవ్వకపోవడం అని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలే చిరు, బాలయ్య సినిమాలను ఒక రోజు తేడాతో విడుదల చేయడం..

అనుకున్నని సింగిల్ స్క్రీన్స్ దొరక్కపోవడం.. గ్రాండ్ ప్రమోషన్స్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మైత్రీ నిర్మాతలకు దిల్ రాజు ఇచ్చిన సాలిడ్ షాక్ విషయంలో ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.. తాము నిర్మించి రెండు పెద్ద సినిమాలను కాపాడుకోవడానికి ఎప్పటిలానే ఓ పాత పద్ధతిని ఫాలో అయిపోవాలని డిసైడ్ అయ్యారు. అదే టికెట్ రేట్ల పెంపు.. గతంలో పెద్ద హీరోల సినిమాలకు పండగ లేదా రిలీజ్ అప్పుడు ఒకవారం, రెండు వారాల పాటు రేట్లు పెంచడం, స్పెషల్ షోలు వేయడం అనేది జరిగేది.

దీంతో ఇప్పుడు మళ్లీ ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ టికెట్ రేట్లు పెంచుకోవడానికి మైత్రీ వారు ఏపీ సీఎం పేషీని కలిశారు. వారికి పరిస్థితులను వివరించి అనుమతినివ్వాలని కోరారు.. వారు కూడా సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే టికెట్ రేట్ల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం నుండి పాజిటివ్ నిర్ణయం వస్తుందనే ఆశతో ఉన్నారు. ఈ పరిణామాన్ని ముందే ఊహించామని.. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలంటూ ఫిలిం వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus