సంక్రాంతి పుంజుల యూ.ఎస్ కలెక్షన్స్ ను దెబ్బ తీస్తున్న నిర్మాతలు..!

చాలా రోజుల తర్వాత యూ.ఎస్ లో మన తెలుగు సినిమాలు పుంజుకుంటున్నాయి. గతేడాది పాన్ ఇండియా సినిమాలు ‘సాహో’ ‘సైరా’ లకే సాధ్యం కాని ఓపెనింగ్స్ ను ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు రాబడుతున్నాయి. ఈ చిత్రాలు వచ్చిన రెండు రోజుల్లోనే 3 మిలియన్ ల డాలర్లను రాబట్టి ఈ ఏడాదికి శుభారంబాన్ని ఇచ్చాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాల దూకుడు ను చూసి.. నిర్మాతలు 25 నుండీ 30 డాలర్ల వరకూ టికెట్ రేట్లు పెంచమని చెబుతున్నారట. దీంతో ఈ చిత్రాల్ని అక్కడ కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ లు నిర్మాతలు చెప్పినట్టే చేసారని తాజా సమాచారం. అయితే అక్కడి తెలుగు ప్రేక్షకులు ఈ విషయం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలకి 30 డాలర్ల వరకూ పెట్టాలా అని ఎలాగూ అమెజాన్ ప్రైమ్ లో ఇస్తున్నట్టు టైటిల్స్ వేశారు కాబట్టి… అప్పుడు చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటున్నారట. ఇలా అయితే కష్టమే మరి..!

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus